ఓటీటీ ఫ్లాట్‌ఫాంలలో(OTT Platforms) క్రియేటివిటీ పేరుతో విచ్చలవిడి శృంగారాన్ని(Adult Content), బూతు డైలాగులను చూపిస్తున్నారని విమర్శిస్తున్నారు సరే.. మరి మన బుల్లితెరలో వచ్చే ప్రోగ్రామ్స్ సంగతేమిటి? యాంకర్లపై ఇష్టం వచ్చినట్టుగా నోరు పారేసుకోవడాలు, బాడీ షేమింగ్ చేయడాలు, పచ్చి బూతులు మాట్లాడటాలను చూస్తూ వదిలేయాలా?

Ramprasad Comments On Rashmi

యాంకర్ రష్మీ గౌతమ్(Rashmi gautham) విషయంలో తాజాగా ఇదే జరిగింది. ఆమె హోస్ట్ చేస్తున్న ఓ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్‌లో ఆటో రామ్‌ప్రసాద్(Auto Ramprasad) దారుణంగా మాట్లాడాడు. ఇదే షోలో ఇప్పటి వరకు డబుల్ మీనింగ్ డైలాగులతో రెచ్చిపోతూ, అదే హాస్యమని కలరింగ్ ఇస్తూ ఉన్న ఆదికి(Hyper adhi) ఇప్పుడు రామ్‌ప్రసాద్ జత కలిశాడు. తన స్కిట్‌లో భాగంగా రష్మిని ఏకంగా రాత్రికి వస్తావా అంటూ డబుల్ మీనింగ్ అర్థం వచ్చేలా ఓ చిల్లర డైలాగ్ కొట్టాడు. పాపం రష్మి ఆ డైలాగును దాటవేయడానికి నన్ను ఎందుకు రమ్మంటున్నావు అని ఎదురు ప్రశ్న వేశారు.. దానికి ఆటో రామ్‌ప్రసాద్ రాత్రికి ఎందుకు రమ్మంటారో తెలియదా? అంటూ మళ్లీ అసహస్యమైన డైలాగు ఒకటి వేశాడు.
దాంతో రష్మితో పాటు సెట్‌లో ఉన్నవారంతా బిత్తరపోయారు. ఏమిటిలా మాట్లాడుతున్నాడు అని అనుకున్నారు. అక్కడే ఉన్న ఇంద్రజ(Indhraja) ఇమ్మీడియట్‌గా రియాక్టయ్యి ఏయ్.. అని గద్దించే సరికి వెంటనే తేరుకున్న రామ్‌ప్రసాద్... ఊరిలో జాతర ఉంది అందుకే పిలిచాను అంటూ కవర్ చేసే ప్రయత్నం చేశాడు. ఇలాంటి కవరింగులు, కలరింగులు ఆ ప్రోగ్రామ్‌లో కామనే అయినా మరీ ఇంత దిగజారుడు చిల్లర డైలాగులు ఉంటే ఎలా? ఈ ప్రశ్ననే నెటిజన్లు అడుగుతున్నారు. ఇంతకు ముందు పాపం యాంకర్ విష్ణుప్రియ(Vishnu Priya) ముక్కు మీద దరిద్రమైన పంచులు వేశారు. ఇమ్మూ(Immu) రంగు మీద, రష్మి మేకప్ మీద అడ్డమైన కామెంట్లు చేశారు. అది హాస్యమని అనుకున్నారు. సోషల్ మీడియాలో నెటిజన్లు చాలాసార్లు తిట్టిపోసినా ఈ తోలుమందంగాళ్లకు అర్థం కావడం లేదు..