ఈమధ్యే తండ్రయ్యాడు కమెడియన్ రాహుల్ రామకృష్ణ(Rahul Ramakrishna) అయితే ఇప్పటి వరకూ తన కొడుకు ఫోటో కాని.. పేరు కాని బయట పెట్టలేదు. ఇక తాజాగా తన కొడుకు పేరును వెల్లడించాడు రాహుల్.. అంతే కాదు తన సుపుత్రిని ఫోటో కూడా శేర్ చేశాడు. అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లోకి చాలా కామ్ గా ఎంటర్ అయ్యాడు రాహుల్ రామకృష్ణ. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వచ్చి.. కమెడియన్ గా మారాడు. సైలెంట్ గా వచ్చి.. స్టార్ గా ఎదిగాడు కమెడియన్ రాహుల్ రామకృష్ణ.

ఈమధ్యే తండ్రయ్యాడు కమెడియన్ రాహుల్ రామకృష్ణ(Rahul Ramakrishna) అయితే ఇప్పటి వరకూ తన కొడుకు ఫోటో కాని.. పేరు కాని బయట పెట్టలేదు. ఇక తాజాగా తన కొడుకు పేరును వెల్లడించాడు రాహుల్.. అంతే కాదు తన సుపుత్రిని ఫోటో కూడా శేర్ చేశాడు.

అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లోకి చాలా కామ్ గా ఎంటర్ అయ్యాడు రాహుల్ రామకృష్ణ. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వచ్చి.. కమెడియన్ గా మారాడు. సైలెంట్ గా వచ్చి.. స్టార్ గా ఎదిగాడు కమెడియన్ రాహుల్ రామకృష్ణ. ఇండస్ట్రీలో ఎంతో మంది కమెడియన్లు ఉన్నా.. ఎవరి స్టైల్ వారిది. అందులో రాహుల్ రామకృష్ణ స్టైల్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే కమెడియన్ గాస్టార్ డమ్ సాధించాడు రాహుల్. తమదైన కామెడీతో ప్రేక్షకులను అలరించారు. ఇక రాహుల్ రామకృష్ణ కూడా తెలంగాణ యాసతో.. తనదైన కామెడీతో ఆకట్టుకుంటూ వస్తున్నాడు.

గత ఏడాది హరిత అనేఅమ్మాయిని పెళ్లి చేసుకున్న రాహూల్ రామకృష్ణ.. ఆ పెళ్ళి విషయాన్ని కూడా సీక్రేట్ గా ఉంచాడు. ఇక ఈ మధ్య తండ్రిగా ప్రమోషన్ పొందాడు స్టార్ కమెడియన్. తన కొడుకు ఫోటో మాత్రం చూపించలేదు.. పేరు కూడా వెల్లడించలేదు. మరిఫ్యాన్స్ నెట్టిట్లో అడుగుతుండటంతో తన తనయుడిని అభిమానులకు పరిచయం చేయడంతో పాటు.. పేరు కూడా వెల్లడించాడు. పేరు కూడా చాలా డిఫరెంట్ గా పెట్టాడు రాహుల్.

ఈ ఏడాది ప్రారంభంలో.. సంక్రాంతి రోజున తనకు కొడుకు పుట్టాడని ట్విట్ చేశాడు. కాకపోతే తన కొడుకు ఫోటో రివీల్ చేయలేదు. పుత్రోత్సాహంతో పొంగిపోయిన రాహుల్.. తన కొడుకు పేరు రూమీ అని వెల్లడించాడు రాహుల్. రుమీ ఎంజాయ్ విత్ ఫ్యామిలీ అని క్యాప్షన్ పెట్టి.. ఫోటోను శేర్ చేశాడు రాహుల్. ఈ ఫోటోలో రాహుల్ భార్య హరిత రుమీని ఎత్తుకొని ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ అవుతోంది.

ఇక ఈ ఫోటోకు నెటిజన్ల నుంచి వరుసగా కామెంట్స్ వస్తున్నాయి. రాహుల్ కు కంగ్రాట్స్ రాహూల్ అన్నా.. రుమీకి స్వాగతం అంటూ... కామెంట్స్ చేస్తున్నారు. రుమీ అంటే ఏంటీ అని కూడా అడుగుతున్నారు. అడుగుతున్నారు. ఇక ఇంతకీ రుమీ అంటే ఏవరంటే.. ఓ పర్షియన్ కవిపేరు అని తెలుస్తోంది. అతడి పేరు తన కుమారుడికి పెట్టినట్లు రాహూల్ రామకృష్ణ పెట్టాడు. ప్రస్తుతం రాహూల్ రామకృష్ణ లీడ్ రోల్ లో ‘ఇంటింటి రామాయణం’ మూవీలో నటిస్తున్నాడు.

Updated On 27 April 2023 1:12 AM GMT
Ehatv

Ehatv

Next Story