తమిళ పరిశ్రమలో కెరీర్ ను స్టార్ట్ చేశాడు జయమణి(Jayamani). కమెడియన్ గా ఎన్నో సినిమాల్లో నటించిన ఆయన.. డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. తాజాగా ఆయనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆయన ఏంచేశాడంటే..?

Jayamani Arrest

నటుడు జయమణిని పోలీసులు అరెస్ట్(Arrest) చేశారు. గిండి పోలీసులు(Guindy police) శుక్రవారం ఆయను అరెస్టు చేశారు. ఇంతకీ ఆయన చేసిన నేరం ఏంటీ అంటే.. మార్నింగ్ వాకింగ్ సమయంలో ఒక న్యాయమూర్తితో(Judge) కావాలని వాదించడంతో పాటు.. ఉద్దేశపూర్వకంగా గొడవకు దిగారంటూ వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు.
కాగా జయమణి... సీనియర్ హీరోలు గౌండమణి, సెంథిల్, వడివేలు వంటి నటులతో కలిసి చిన్న చిన్న హాస్య పాత్రలు చేశారు. ఇపుడు చిత్ర పరిశ్రమలో అవకాశాలు పెద్దగా లేకపోవడంతో సొంత వ్యాపారాలు చేసుకుంటున్నారు.