ఫస్ట్ టైమ్ డైరెక్ట్ చేసినా.. బలగం సినిమా(Balagam Movie)ను అద్భుతంగా తెరకెక్కించాడు కమెడియన్ వేణు(Comedian Venu). ఎక్స్ పీరియన్స్ ఉన్న దర్శకుడిలా.. సినిమా అంతా క్వాలిటీ మేయింటేన్ చేశాడు. బలగం సినిమాతో దిల్ రాజు(Dil Raju)నుదిల్ ఖుష్ చేసిన వేణు మరో సినిమా ఆఫర్ ను కొట్టేశాడు.
టాలీవుడ్(Tollywood) లో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న సినిమా పేరు బలగం(Balagam Movie). ఈ సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్ తో పాటు .. టాలీవుడ్ పెద్దల మనసులు కూడా గెలుచుకున్నాడు డైరెక్టర్ వేణు(Director Venu). ఫస్ట్ సినిమానే అయినా.. బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చాడు.

Balagam Director Venu
ఫస్ట్ టైమ్ డైరెక్ట్ చేసినా.. బలగం సినిమా(Balagam Movie)ను అద్భుతంగా తెరకెక్కించాడు కమెడియన్ వేణు(Comedian Venu). ఎక్స్ పీరియన్స్ ఉన్న దర్శకుడిలా.. సినిమా అంతా క్వాలిటీ మేయింటేన్ చేశాడు. బలగం సినిమాతో దిల్ రాజు(Dil Raju)ను దిల్ ఖుష్ చేసిన వేణు మరో సినిమా ఆఫర్ ను కొట్టేశాడు .
టాలీవుడ్(Tollywood) లో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న సినిమా పేరు బలగం(Balagam Movie). ఈ సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్ తో పాటు .. టాలీవుడ్ పెద్దల మనసులు కూడా గెలుచుకున్నాడు డైరెక్టర్ వేణు(Director Venu). ఫస్ట్ సినిమానే అయినా.. బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చాడు. దిల్ రాజు నిర్మించిన మున్నా సినిమాతోనే కమెడియన్ గా పరిచయం అయిన వేణు.. దిల్ రాజు ప్రొడక్షన్(Dil Raju Production) లోనే దర్శకుడిగా మారాడు. అంతే కాదు ప్రస్తుతం మరో ఆఫర్ ను కూడా అందుకున్నాడు బలగం వేణు.
కమెడియన్ గా వెండితెరకు పరిచయం అయ్యాడు వేణు. చిన్న చిన్న పాత్రలు చేసుకుంట.. హాస్య నటుడిగా టాలీవుడ్ లో అడుగు పెట్టి జబర్థస్త్ షోతో పాపులర్ అయ్యాడు వేణు. కామెడీ రోల్స్ చేస్తూ.. సైలెంట్ గా దర్శకుడిగా మారాడు. బలగం రిలీజ్ అయ్యేవారకూ వేణు ఈ సినిమా చేశాడని ఎవరికీ తెలియదు. చ్చ మైన తెలంగాణ పల్లెలో వాతావరణం, ప్రజల మానవ సంబంధాల మధ్య జరిగే కథతో బలగం తెరకెక్కింది. సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాదు.. ఎమోషనల్ గా ఏడిపించేసింది. ఈసినిమాలో సెంటిమెంట్ తో.. ప్రతీ ఒక్కరిని కంటతడి పెట్టించాడు. తెలంగాణ సంస్కృతి, పల్లె గురించి అద్భుతంగా బలగాన్ని తెరకెక్కించిన వేణు అందరినీ ఆశ్చర్య పరిచాడు.
ఈ భారీ హిట్ తర్వాత వేణు నెక్ట్స్ సినిమాపై ఇండస్ట్రీలో .. అప్పుడే గుసగుసలు మొదలయ్యాయి. ఈ విషయంలో వేణు క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే అందరూ ఊహించినట్టే..దిల్ రాజుతోనే తన నెక్ట్స్ మూవీ ఉండబోతున్నట్టు వేణు అన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే దిల్ రాజుకు స్టోరీ కూడా చెప్పాడట వేణు. అయితే ఈ కథలో కొన్ని మార్పులు చేప్పారట దిల్ రాజు. కథలో ఆ మార్పులు ఇంకా అద్భుతంగా ఉన్నాయని వేణు కూడా వాటిపై వర్కౌట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ మార్పులుతరువాత మరోసారి దిల్ రాజును కలిసి కథ వివరించి.. సినిమా ఫిక్స్ చేసుకుంటానన్నారు.
బలగం సక్సెస్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు వేణు టీమ్. ఇండస్ట్రీ పెద్దలు కూడా సినిమా చూసి వేణ అండ్ టీమ్ ను మెచ్చుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి స్వయంగా పిలిపించుకుని వేణుతో సహా మేయిన్ టీమ్ ను సన్మానించారు. ఇక మంచు మోహన్ బాబు, మంచు విష్ణు కూడా సినిమా చూసి.. ఎమోషనల్ ఫీల్ అయ్యి.. టీమ్ ను ఇంటికి పిలిచి సన్మానించి పంపించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తోంది బలగం సినిమా. ఇక వేణు కూడా ఇటు దర్శకుడిగా.. అటు నటుడిగా కూడా కొనసాగుతానంటున్నాడు.
