పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌కు(Pawan kalyan) సినిమా ఇండస్ట్రీలో కూడా అభిమానులున్నారు.

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌కు(Pawan kalyan) సినిమా ఇండస్ట్రీలో కూడా అభిమానులున్నారు.

స్నేహితులు ఉన్నారు. పవన్‌ అంటే ఇష్టపడే వారు ఉన్నారు. పవన్‌-అలీ(Ali) ఎంత మంచి ఫ్రెండ్సో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవన్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పట్నుంచి వీరిద్దరి మధ్య మంచి బాండింగ్‌ ఉంది. వీరి కాంబోలో వచ్చిన సినిమాలు కూడా విజయవంతమయ్యాయి. పవన్‌ సినిమాలో అలీ కంపల్సరీగా ఉండాల్సిందే. అయితే రాజకీయాల(Politics) కారణంగా వీరిద్దరి మధ్య గ్యాప్‌ వచ్చింది. మొన్నటి వరకు అలీ వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో(YSRCP) ఉన్నారు. ఇప్పుడా పార్టీకి, రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇదలా ఉంచితే రామ్‌(Ram) హీరోగా, పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన డబుల్ ఇస్మార్ట్(Double Ismart) సినిమా ఈ నెల 15వ తేదీన విడుదల కానుంది. ఫక్తు పూరీ జగన్నాధ్‌(Puri Jagannadh) మార్క్‌ సినిమా ఇది! ఇందులో అలీ గెటప్‌ సరికొత్తగా కనిపిస్తోంది. పూరి సినిమాలో అలీ కామెడీ ట్రాక్‌ చాలా బాగుంటుంది. కథతో సంబంధం లేకపోయినా అలీ కోసమే పూరి కామెడీ ట్రాక్‌ను క్రియేట్ చేస్తారు. డబుల్ ఇస్మార్ట్ సినిమాలో కూడా ఇంతే! మొదట అలీ లేడట! సినిమా అంతా కంప్లీట్‌ అయ్యాక అలీ ఉంటే బాగుంటుందని పూరికి అనిపించిందట! వెంటనే అలీ కోసం ఓ ట్రాక్‌ రాశాడట! అలీ కూడా అద్భుతంగా నటించాడట! ఇంతకు ముందు కూడా పూరి జగన్నాథ్‌ ఇలాగే చేశాడు. దేశముదురు సినిమాలో కూడా అలీ ముందు లేడు. చివర్లో తన పాత్రని యాడ్ చేయాల్సివచ్చింది. మళ్లీ డబుల్ ఇస్మార్ట్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్‌ విడుదలైంది. ఈ ట్రైలర్‌లో అలీ ప్రత్యేక పాత్రలో కనిపించారు. చూడడానికి కోతి రూపంలో అలీ ప్రత్యేక పాత్రలో ఉన్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఆదివారం జరిగింది. ఈ వేడుకలో పవన్‌ కల్యాణ్‌తో కలిసి మళ్లీ సినిమా ఎప్పుడు చేస్తారు అని ఓ అభిమాని అలీని అడిగాడు. పిఠాపురం తాలూకాలో ఎప్పుడు చేరుతారు? సినిమాల్లో పవన్ తో కలిసి మిమ్మల్ని చూడాలని ఎదురుచూస్తున్నాము అని ఆ అభిమాని అడిగాడు. దీనికి రియాక్టయిన అలీ ఓకే అన్నట్లుగా సైగ చేశారు అంతే! త్వరలోనే పవన్‌-అలీ కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తుందని ఫ్యాన్స్‌ అనుకుంటున్నారు.

Eha Tv

Eha Tv

Next Story