అల్లు అర్జున్ ఇంటి దగ్గర టెన్షన్.. టెన్షన్.!
అల్లు అర్జున్ ఇంటి దగ్గర టెన్షన్.. టెన్షన్.! అల్లు అర్జున్ ఇంటి ముందు ఓయూ జేఏసీ నిరసన.
ఇంట్లోకి వెళ్లి పూలకుండీలు పగలగొట్టిన నిరసనకారులు.
రేవతి కుటుంబానికి కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్.
రేవతి చనిపోయింది, బాలుడికి గాయాలయ్యాయని చెప్పాం అల్లు అర్జున్ మేనేజర్‌కి తొక్కిసలాట సమాచారం ఇచ్చాం.
అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసీ నేతల దాడి ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు.
శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా రాష్ట్ర డీజీపీ, నగర పోలీసు కమిషనర్ ను ఆదేశిస్తున్నాను.
సంధ్య థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీసు సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి’ అని ట్వీట్ చేశారు రేవంత్ రెడ్డి.
మరోవైపు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో అల్లు అర్జున్ పై ఏసిపి విష్ణు మూర్తి ప్రెస్ మీట్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది.
ఉన్నతాధికారుల నుండి ఎలాంటి అనుమతి తీసుకోకుండా విష్ణు మూర్తి ప్రెస్ మీట్ పెట్టారు. దీనిపై పోలీస్ శాఖ సిరియస్ అయ్యింది.