తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) ముందుగా తీసుకున్న నిర్ణయం పైనే నిలబడింది.

తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) ముందుగా తీసుకున్న నిర్ణయం పైనే నిలబడింది. బెనిఫిట్ షోస్(Benefit Show) లేవు అని తేల్చి చెప్పేసింది.

FDC చైర్మన్ మరియు నిర్మాత అయినా దిల్ రాజు(Dil raju) సార్ధ్యంలో.. ముఖ్యమంత్రి(CM Revanth reddy) తో భేటీ అయిన సినీ పెద్దలకు.. ప్రభుత్వం నుండి కొన్ని కఠినమైన నిర్ణయాలు, మాటలే ఎదురయ్యాయి. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల(Ticket Price) విషయంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఇకపై ఎటువంటి బెనిఫిట్ షోస్ ఉండవు, టికెట్ ప్రైస్ పెంపు ఉండదు అని తేల్చేసింది.

ఒకవైపు స్ట్రిక్ట్ గా ఉంటూనే సినిమా పరిశ్రమకు మేము వ్యతిరేకం కాదు, ఎప్పుడూ మీ అభివృద్ధికి సహకరిస్తాం అని చెప్పింది. సినిమాకు సంబంధించి హైదారాబాద్ అంతర్జాతీయ స్థాయిలో ఎదిగేలా కృషి చేయాలని.. అందుకు తగిన ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి సూచించినట్టు దిల్ రాజు చెప్పారు.

త్వరలో 5 గురు లేదా 7 గురు సభ్యులతో సబ్ కమిటీ ఏర్పాటు కానుంది. ఇందులో ప్రభుత్వం నుండి ఇద్దరు మంత్రులు, సినీ రంగం నుండి దిల్ రాజుతో పాటు మిగితా సభ్యులను ఎంపిక చేసే అవకాశం ఉంది. హాలీవుడ్ వారు కూడా హైదారాబాద్ లో వచ్చి వర్క్ చేసే విధంగా ఏర్పాట్లు చేయాలంటే ఏం చేయాలి అనే విషయం పై దృష్టి పెట్టనున్నట్లు దిల్ రాజు మీడియాకు చెప్పారు. సంక్రాంతి సినిమాలు చిన్న విషయం అని వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాం అని దిల్ రాజు అన్నారు.

Eha Tv

Eha Tv

Next Story