తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(cm revanth reddy) లేటెస్ట్‌ ఫోటో(Photo) ఒకటి ట్రెండింగ్‌లో ఉంది. అందులో రేవంత్‌రెడ్డి తన షర్ట్‌(Shirt) కింద భాగాన్ని ముడేసుకున్నట్టుగా ఉంది.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(cm revanth reddy) లేటెస్ట్‌ ఫోటో(Photo) ఒకటి ట్రెండింగ్‌లో ఉంది. అందులో రేవంత్‌రెడ్డి తన షర్ట్‌(Shirt) కింద భాగాన్ని ముడేసుకున్నట్టుగా ఉంది. నిజానికి అది స్టయిలీష్‌గానే ఉంది. కాకపోతే ఈ స్టయిల్‌ ఇప్పటిదేం కాదు.. దీవార్‌(Deewaar) సినిమాలో అమితాబ్‌బచ్చన్‌(Amitabh Bachchan) స్టయిల్ ఇది! ఏడో దశకం మధ్యలో వచ్చిన దీవార్‌ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకుని అమితాబ్‌ స్టార్‌డమ్‌ను మరింత పెంచింది. యశ్‌ చోప్రా(Yash Chopra) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అమితాబ్‌ నటన అపూర్వం. అమితాబ్‌ కెరీర్‌లో ఇది మైలురాయిలా నిల్చిపోయింది. ఈ సినిమా తొలి అర్థభాగంలో అమితాబ్‌ తన షర్ట్‌ను ముడేసుకుంటాడు. ఇది అప్పట్లో ట్రెండ్‌సెట్టర్‌ అయ్యింది. ఆనాటి యువతరమంతా చొక్కాలు ఇలా ముడేసుకుని తిరిగారు. అదో ఫ్యాషన్‌గా(Fashion) మారింది. చాన్నాళ్ల పాటు ఈ స్టయిల్‌ కొనసాగింది. చాలా మంది హీరోలు ఈ శైలిని అనుకరించారు. నిజానికి అమితాబ్‌ తన షర్ట్‌ను స్టయిల్ కోసం ముడేసుకోలేదు. ఫస్ట్‌ డే షూటింగ్‌ అప్పుడు జరిగిన సంఘటన గురించి ఆ మధ్య అమితాబ్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. 'షాట్‌ రెడీగా ఉంది. డైరెక్టర్‌ యశ్‌ చోప్రా యాక్షన్‌ అని అనగానే నేను షర్ట్‌ను చూసుకున్నాను. అది చాలా పొడవుగా ఉందని అప్పుడు అర్థమయ్యింది. మోకాళ్లు దాటి ఉండటంతో ఏం చేయాలో అర్థం కాలేదు. పోనీ మరో షర్ట్ వేసుకుందామనుకుంటే అక్కడ షర్ట్‌లేమీ లేవు. దాంతో షర్ట్‌కు ముడేశాను. అది ఫ్యాషన్‌ అవుతుందని అప్పుడు నాకు తెలియదు' అని అమితాబ్‌ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని చూసి యూత్‌ షర్ట్‌ను ముడేసుకుంటారేమో చూడాలి!

Updated On 22 Jan 2024 3:11 AM GMT
Ehatv

Ehatv

Next Story