బాలకృష్ణ హోస్ట్‌గా వచ్చిన అన్‌స్టాపబుల్‌(Unstopable) టాక్ షో ఎంత సక్సెస్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

బాలకృష్ణ హోస్ట్‌గా వచ్చిన అన్‌స్టాపబుల్‌(Unstopable) టాక్ షో ఎంత సక్సెస్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రముఖ ఓటీటీలో వచ్చిన మూడు సీజన్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు అన్‌స్టాపబుల్ సీజన్-4 (Unstoppable season-4) సిద్ధమవుతోంది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందడి చేయనున్నారు. ఫస్ట్ ఎపిసోడ్ చిత్రీకరణలో చంద్రబాబు (CM Chandrababu) పాల్గొన్నారు కూడా . సీజన్-4లో ఫస్ట్ గెస్ట్‌గా ముఖ్యమంత్రి చంద్రబాబు రాబోతున్నారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఇవాళ చిత్రీకరణ జరుగుతోంది. ఇంతకు ముందు అన్‌స్టాపబుల్ సీజన్-2లో చంద్రబాబు పాల్గొని పలు జీవిత విశేషాలను తన వియ్యంకుడైన బాలకృష్ణతో(Balakrishna) పంచుకున్నారు. అప్పుడాయన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అన్‌స్టాపబుల్ టాక్ షోకి హాజరయ్యారు. అయితే గత సీజన్‌లో తెలుగుదేశం పార్టీ సంక్షోభం, నాటి పరిస్థితులపై ఆయన బాలకృష్ణతో ముచ్చటించారు. ఇప్పుడు కూటమి ఘన విజయం గురించి, ఎన్నికలకు ముందు, తదనంతర పరిణామాలప మాట్లాడబోతున్నారు. ఈ ఎపిసోడ్‌పై ఆల్‌రెడీ ఆసక్తి మొదలయ్యింది.

Eha Tv

Eha Tv

Next Story