మంచు ఫ్యామిలీ(Manchu Family)లో విభేదాలు రోడ్డున పడ్డాయి. అన్నదమ్ముల మధ్య గొడవలు ఇప్పుడు రహస్యమేమీ కాదు, బహిరంగమే! మంచు విష్ణు(Manchu Vishnu), మంచు మనోజ్(manchu Manoj)ల మధ్య పొరపొచ్చాలేర్పడ్డాయని, ఇద్దరికీ అసలు పడటం లేదనీ వచ్చిన వార్తలు నిజమేనని తేలింది.
మంచు ఫ్యామిలీ(Manchu Family)లో విభేదాలు రోడ్డున పడ్డాయి. అన్నదమ్ముల మధ్య గొడవలు ఇప్పుడు రహస్యమేమీ కాదు, బహిరంగమే! మంచు విష్ణు(Manchu Vishnu), మంచు మనోజ్(manchu Manoj)ల మధ్య పొరపొచ్చాలేర్పడ్డాయని, ఇద్దరికీ అసలు పడటం లేదనీ వచ్చిన వార్తలు నిజమేనని తేలింది. మంచు మనోజ్ బయటపెట్టిన వీడియోతో ఇద్దరి మధ్య సఖ్యత లేదని అందరికీ తెలిసిపోయింది. అన్నదమ్ముల మధ్య కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. విష్ణుతో మోహన్‌బాబు(Mohan Babu) కలిసి ఉంటున్నారు. మంచు మనోజ్ విడిగా ఉంటున్నాడు. రెండు మూడేళ్లుగా విష్ణుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు కూడా మనోజ్ చెప్పడం లేదు. అంటే చాన్నాళ్లుగా ఇద్దరికీ పడటం లేదన్నమాట. ఇటీవల జరిగిన మనోజ్ వివాహాని(Manu Manoj Marriage)కి కూడా విష్ణు చుట్టుపుచూపుగా వచ్చి వెళ్లాడే కానీ దగ్గరుండి అన్ని చూసుకోలేదు. తాజాగా మోహన్‌బాబు పుట్టిన రోజు వేడుకల్లోనూ విభేదాలు కొట్టొచ్చినట్టు కనిపించాయి. వేదిక మీద విష్ణు-మోహన్‌బాబు కలిసే ఉన్నారు కానీ మనోజే దూరంగా కూర్చొన్నాడు. దగ్గరకు రమ్మని మోహన్‌బాబు పిలిచినా మనోజ్ రాలేదు. లేటెస్ట్‌గా మనోజ్ ఫేస్‌బుక్ పోస్ట్(manoj Facebook Post)తో గొడవ కలకలం రేపుతున్నది. తన మనిషి సారథిని విష్ణు కొట్టాడంటూ మనోజ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇళ్లలోకి చొరబడి ఇలా కొడుతూ ఉంటాడంటూ విష్ణుపై సీరియస్ అయిన మనోజ్. విష్ణు తరచూ ఇలాగే చేస్తున్నాడంటూ మనోజ్ కామెంట్ చేశాడు.