పవర్‌స్టార్ పవన్ కల్యాణ్(Pawan kalyan) కథానాయక పాత్రలో నటిస్తున్న హరిహర వీరమల్లు(Hari hara Veeramallu) సినిమా ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. ఎన్నికలు అయిపోయాయి కాబట్టి ఇక ఇప్పుడు పవన్‌కు సినిమాల్లో నటించే తీరిక దొరుకుతుందేమో! అదలా ఉంచితే ఈ సినిమా నుంచి ఒక్కొక్కరుగా తప్పుకుంటున్నారు. కొత్తవారు వచ్చి చేరుతున్నారు.

Hari Hara Veeramallu
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్(Pawan kalyan) కథానాయక పాత్రలో నటిస్తున్న హరిహర వీరమల్లు(Hari hara Veeramallu) సినిమా ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. ఎన్నికలు అయిపోయాయి కాబట్టి ఇక ఇప్పుడు పవన్‌కు సినిమాల్లో నటించే తీరిక దొరుకుతుందేమో! అదలా ఉంచితే ఈ సినిమా నుంచి ఒక్కొక్కరుగా తప్పుకుంటున్నారు. కొత్తవారు వచ్చి చేరుతున్నారు. దర్శకుడు క్రిష్(Krish) పక్కకు జరిగిన విషయం తెలిసిందే కదా! క్రిష్ పర్యవేక్షణలోనే మరో దర్శకుడు ఆ బాధ్యతను తీసుకున్నారు. ఇంతకు ముందే ఈ సినిమా నుంచి అర్జున్ రాంపాల్(Arjun Rampal) వైదొలిగాడు. ఔరంగజేబు పాత్ర కోసం అర్జున్ రాంపాల్‌ను తీసుకున్నారు. షూటింగ్ బాగా ఆలస్యం అవుతుండటంతో సినిమా నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు అతడి స్థానంలో బాబీ డియోల్‌ను(Bobby Deol) తీసుకున్నారు. ఇప్పుడు ఈ మెగా ప్రాజెక్ట్ నుంచి సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్(Gnanashekar) తప్పుకున్నాడు. అతడి స్థానంలో మనోజ్ పరమహంసను తీసుకున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ ప్రకటించారు. ఇంతకు ముందు ఈ సినిమా టైటిల్స్‌లో జ్ఞానశేఖర్ పేరు మాత్రమే కనిపించింది. ఈ మధ్యనే మనోజ్ పరమహంస పేరును జత చేశారు. త్వరలోనే కొత్త షెడ్యూల్ మొదలుపెట్టబోతున్నారు. ఇదే సమయంలో పోస్ట్ ప్రొడక్షన్, గ్రాఫిక్స్ పనులను కూడా జరుపుతున్నారు.
