ప్రేక్షకులు ఏ సినిమా చూడాలన్నా టికెట్టు ధర కేవలం 99 రూపాయలే. దేశంలోని వివిధ నగరాల్లో ఫిబ్రవరి 23 న బుక్ చేసిన అన్ని ప్రదర్శనల

ఈ శుక్రవారం సినిమా చూడాలనుకుంటున్న వాళ్లకు బంపర్ ఆఫర్. ఎందుకంటే.. ఫిబ్రవరి 23ని 'సినిమా లవర్స్ డే' గా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ శుక్రవారం 'సినిమా లవర్స్ డే' నాడు PVR INOX సినిమా చైన్‌లలో రూ. 99 టిక్కెట్ ధరతో సినీ ప్రియులు తమకు ఇష్టమైన సినిమాలను చూడవచ్చు. వీక్షకులు "ఆల్ ఇండియా ర్యాంక్", "ఆర్టికల్ 370", "క్రాక్", "తేరీ బాటన్ మే ఐసా ఉల్జా జియా", "ఫైటర్" వంటి బాలీవుడ్ సినిమాలను 99 రూపాయలకే చూడవచ్చు. "మేడమ్ వెబ్", "ది హోల్డోవర్స్", "బాబ్ మార్లే-వన్ లవ్", "మీన్ గర్ల్స్", "ది టీచర్స్ లాంజ్" లాంటి హాలీవుడ్ సినిమాలను కూడా ఎంచక్కా చూసేయొచ్చు.

ప్రీమియం రేంజిలో కూడా సినిమా లవర్స్ డే రోజున PVR INOX ఆకర్షణీయమైన ధరలతో సినిమా చూడొచ్చని తాజా ప్రకటనలో తెలిపింది. ప్రీమియం రేంజిలో 199 రూపాయలకే సీట్లు బుక్ చేసుకోవచ్చు. రిక్లైనర్ సీట్ల టిక్కెట్ ధరను రూ. 199కి తగ్గించింది. IMAX, 4DX, MX4D, గోల్డ్ కేటగిరీలో సినిమాలను చూడాలనుకునే వారు కూడా టిక్కెట్ ధరలపై తగ్గింపు లభించనుంది.

సినిమా లవర్స్ డే తేదీ జనవరి 20 అయితే ఈ సంవత్సరం కాస్త ఆలాసంగా ఫిబ్రవరి 23 న నిర్వహిస్తున్నారు. శుక్రవారం నాడు విడుదలయ్యే కొత్త సినిమాలు కూడా ఈ ఉత్సవం పరిధిలోకొస్తాయి. ప్రేక్షకులు ఏ సినిమా చూడాలన్నా టికెట్టు ధర కేవలం 99 రూపాయలే. దేశంలోని వివిధ నగరాల్లో ఫిబ్రవరి 23 న బుక్ చేసిన అన్ని ప్రదర్శనల కోసం రూ. 99 సెలబ్రేటరీ ఆఫర్ వర్తిస్తుందని, ఈ ఆఫర్ రెండవ శ్రేణి, మూడవ శ్రేణి నగరాలకు/పట్టణాలకు వర్తించదని సంస్థ ప్రతినిధులు తెలిపారు. అయితే కర్ణాటక మినహా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఈ ఆఫర్ లేదు.

Updated On 22 Feb 2024 10:10 PM GMT
Yagnik

Yagnik

Next Story