పలు సినిమాలు విడుదలైనా కూడా.. మంచి వసూళ్లను సాధించలేకపోయాయి. పొంగల్ సమయంలో విడుదలైన సినిమాలలో

తెలుగు రాష్ట్రాల తర్వాత భారీగా సినిమాలను ఆదరించే రాష్ట్రంగా తమిళనాడుకు పేరుంది. అలాంటి తమిళనాడులో చాలా వరకూ థియేటర్లు మూతబడుతూ ఉన్నాయి. గత కొంత కాలంగా తమిళ సినిమా చాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. గత అక్టోబర్‌లో విడుదలైన విజయ్‌ నటించిన 'లియో' తర్వాత ఏ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకోలేకపోయింది. ఆ తర్వాత పలు సినిమాలు విడుదలైనా కూడా.. మంచి వసూళ్లను సాధించలేకపోయాయి. పొంగల్ సమయంలో విడుదలైన సినిమాలలో తమిళనాడులో ఏ సినిమా కూడా 100 కోట్ల గ్రాస్ వసూలు చేయలేకపోయింది. స్టార్ హీరోల సినిమాలు రాక, సింగిల్ స్క్రీన్‌స్ థియేటర్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చాలా థియేటర్ యజమానులు తమ థియేటర్‌లను పూర్తిగా మూసివేయడం మొదలుపెట్టారు. చెన్నైలో, రాబోయే నెలల్లో దాదాపు 6 సింగిల్ స్క్రీన్‌లు మూసివేయనున్నారు. అలాగే కోయంబత్తూర్‌లో 5 సింగిల్ స్క్రీన్‌లు మూసివేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రతి ప్రాంతంలోని సింగిల్ స్క్రీన్‌లు సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఈ ఏడాది తమిళనాడులో దాదాపు 40 సింగిల్ స్క్రీన్‌లు మూసి వేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. స్టార్ హీరోల చిత్రాలకు కూడా చాలా మంది ప్రేక్షకులు మల్టీప్లెక్స్‌లకే ప్రాధాన్యం ఇస్తుండటంతో సింగిల్ స్క్రీన్‌లు నిలదొక్కుకోలేకపోతున్నాయి. ఇక తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లు కూడా ఎక్కువ శాతం డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి సింగిల్ స్క్రీన్‌లు డబ్బు సంపాదించడానికి చాలానే కష్టాలు పడుతూ ఉన్నాయి. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. రాబోయే సంవత్సరాల్లో చాలా సింగిల్ స్క్రీన్‌లు మూసివేయబడే అవకాశం ఉంది.

Updated On 14 Feb 2024 11:54 PM GMT
Yagnik

Yagnik

Next Story