తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు రాజకీయం అంత సినిమా చుట్టూ తిరుగుతుంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు రాజకీయం అంత సినిమా చుట్టూ తిరుగుతుంది. తెలంగాణ C.M. ఇండస్ట్రీ మీద సీరియస్ గా ఉన్నట్టుగా కనిపించగానే.. ఇండస్ట్రీ ఆంధ్రాకు వస్తే బాగుంటుంది అని ఏ. పి. డిప్యూటీ సి. ఎమ్. పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) ఆహ్వానం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు సినీ పెద్దలు ఆంధ్రా వైపు ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి.
ఈ వార్తలు బయటకొచ్చిన సమయంలో నిర్మాత నాగవంశీ(Naga Vamshi) మీడియాతో మాట్లాడుతూ.. సినిమా రెండు రాష్ట్రాలకు సమాన ప్రాధాన్యతను ఇస్తుంది. ఇక్కడి నుండి ఎందుకు వెళతాం అని అన్నారు. సంక్రాంతి సినిమాకు పెయిడ్ ప్రీమియర్ అవసరం లేదు, ఉదయం 4 గంటలకు షో స్టార్ట్ అయితే చాలు అన్నారు.
ఎఫ్.డి సి. చైర్మన్ అమెరికా నుండి వచ్చాక ఈ విషయం పై నిర్ణయం తీసుకుంటాం అన్నారు. టీ.డి.పి. నాయకుడు పల్లా శ్రీనివాస్ కూడా ఇండస్ట్రీ ఆంధ్రాకు వస్తే బాగుంటుందని వ్యాఖ్యలు చేశారు. అటు ఇకముందు తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండబోవని తెలంగాణా సి.ఎమ్. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిన విషయం తెలిసిందే. మరి ఎఫ్.డి.సి. చైర్మన్ గా కొత్తగా ఎంపిక అయిన దిల్ రాజు తన ప్రొడక్షన్ లో రాబోతున్న సంక్రాంతి సినిమాల విషయంలో ప్రభుత్వ పెద్దలతో ఎటువంటి చర్చలు జరుపుతారు అనేది చూడాలి.
