సందీప్‌రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో, బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌(Ranbir kapoor) నటించిన సూపర్‌హిట్‌ సినిమా యానిమల్‌(Animal) బాక్సాఫీస్‌ దగ్గర భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. దాదాపు 900 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి రికార్డు క్రియేట్‌ చేసింది. తండ్రీ కొడుకుల సెంటిమెంట్‌తో గత ఏడాది వచ్చిన ఈ సినిమా ఓటీటీలో(OTT) ఎప్పుడెప్పుడు వస్తుందా అని సినిమా అభిమానులు ఎదురుచూస్తున్నారు.

సందీప్‌రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో, బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌(Ranbir kapoor) నటించిన సూపర్‌హిట్‌ సినిమా యానిమల్‌(Animal) బాక్సాఫీస్‌ దగ్గర భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. దాదాపు 900 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి రికార్డు క్రియేట్‌ చేసింది. తండ్రీ కొడుకుల సెంటిమెంట్‌తో గత ఏడాది వచ్చిన ఈ సినిమా ఓటీటీలో(OTT) ఎప్పుడెప్పుడు వస్తుందా అని సినిమా అభిమానులు ఎదురుచూస్తున్నారు. రిపబ్లిక్‌ డే సందర్భంగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో(Netflix) స్ట్రీమింగ్‌ చేయాలని మేకర్స్‌ అనుకుంటున్నారు. జనవరి 26వ తేదీ నుంచి యానిమల్‌ స్ట్రీమింగ్‌ కానుందనే వార్తలు వస్తున్నాయి. యానిమల్‌ రన్‌టైమ్‌ మూడున్నర గంటలు ఉండటంతో ప్రేక్షకులకు ఇబ్బంది కలగకుండా ఉండటంతో దాదాపు తొమ్మిది నిమిషాల సన్నివేశాలను కట్‌ చేసినట్టు దర్శకుడు సందీప్‌రెడ్డి ఇంతకు ముందే చెప్పాడు. నెట్‌ఫ్లిక్స్‌ కోసం ఎడిటింగ్‌ చేస్తున్నట్టు చెప్పాడు.థియేటర్‌ కోసం తొలగించిన కొన్ని సన్నివేశాలను ఓటీటీ వెర్షన్‌ కోసం యాడ్‌ చేస్తున్నట్టు సందీప్‌రెడ్డి తెలిపాడు. అందులో రష్మికతో(Rashmika) రణ్‌బీర్‌ కపూర్‌ ముద్దు సన్నివేశం కూడా ఉందట! యానిమల్‌ చిత్రాన్ని టీ-సిరీస్‌ ఫిల్మ్స్‌, భద్రకాళి పిక్చర్స్‌, సినీ 1 స్టూడియోస్‌ సంయుక్తంగా కలిసి నిర్మించాయి. ఇందులో సినీ1 స్టూడియోస్‌(Cine 1 Studios) యానిమల్‌ ఓటీటీ రిలీజ్‌ను నిలిపివేయాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. యానిమల్‌ శాటిలైట్‌ హక్కుల విషయంలో సూపర్ క్యాసెట్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, క్లూవర్ మ్యాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలతో ఒప్పందం జరిగిందని, అయితే వారి నుంచి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా తనకు చెందలేదని సినీ1 స్టూడియోస్‌ ఆరోపిస్తోంది. కోర్టులో దావా కూడా వేసింది. దీంతో కోర్టు నెట్‌ఫ్లిక్స్‌తో పాటు చిత్ర నిర్మాణ సంస్థలకు సమన్లు జారీ చేసింది. ఈ అంశంపై ఇవాళ అంటే శనివారం వివరణ ఇవ్వాలని న్యాయస్థానం కోరింది. జనవరి 22వ తేదీన ఈ వివాదంపై విచారణ జరగనుంది.

Updated On 20 Jan 2024 12:07 AM GMT
Ehatv

Ehatv

Next Story