టెలివిజన్ రంగంలో సంచలనం సృష్టించిన సీరియల్ CID. బుల్లితెర పై ఎక్కువ కాలం కొనసాగి.. ప్రేక్షకాదరణ పొందిన సీరియల్ సీఐడీ. ఇందులో నటీనటులు అందరూ ఆడియన్స్ కు ఫేవరేట్ గా నలిచారు. విశేష ప్రజాదరణ ఆదరణ పొందిన సీరియల్ ఏదీ అంటే ఠక్కున CID పేరు చెపుతారు అంతా.

టెలివిజన్ రంగంలో సంచలనం సృష్టించిన సీరియల్ CID. బుల్లితెర పై ఎక్కువ కాలం కొనసాగి.. ప్రేక్షకాదరణ పొందిన సీరియల్ సీఐడీ. ఇందులో నటీనటులు అందరూ ఆడియన్స్ కు ఫేవరేట్ గా నలిచారు. విశేష ప్రజాదరణ ఆదరణ పొందిన సీరియల్ ఏదీ అంటే ఠక్కున CID పేరు చెపుతారు అంతా. అలా ఆడియన్స్ ను అరిస్తూ వచ్చిన ఈసీరియల్ హిందీతో పాటు.. తెలుగులో కూడా ఈసీరియల్ కు మంచి ఆదరణ ఉంది. ఈ సీరియల్ లో నటించిన ఆఫీసర్లు అంతా జనాలకు ఫెవరేట్ గా నలిచారు. అందులో ప్రణీత్(Praneeth) క్యారెక్టర్ చేసిన ఆపీసర్ తన కామెడీతో ఎంతో నవ్వించారు.. ప్రణీత్ లేకుండా ఎపిసోడ్ అంటే.. బోరింగ్ అనేవారు. అటువంటి నటుడు ఇప్పుడు హాస్పిటల్(Hospital) లో ఉన్నారు.

ఈ సీరియల్ లో నటించిన దినేష్ ఫడ్నిస్(Dinesh Phadnis) తీవ్ర గుండెపోటుతో(Heart attack) ఆసుపత్రి పాలైయ్యాడు. దాదాపు 20 ఏళ్ల పాటు తిరుగులేని సీరియల్‌గా పేరుపొందిన ‘CID’లో కామెడీ పోలీసు అధికారిగా ఫ్రెడరిక్స్ పాత్రలో కనిపించిన నటుడు దినేష్ ఫడ్నిస్. ఆయన రీసెంట్ గా గుండెపోటుకు గురయ్యారు. డిసెంబరు 1న ఆయనకు గుండెపోటు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే వెంటనే గుర్తించిన ఫ్యామిలీ మెంబర్స్.. ముంబైలోని(Mumbai) తుంగా ఆసుపత్రికి తరలించారు. గత రెండు రోజులుగా ఆయనకు వెంటిలేటర్ ఉన్నారు. అత్యవసర చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. ఇక ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ విషయం తెలుసుకున్న CID ఫేమ్ నటులు.. ఆసుపత్రికి చేరుకుని దినేష్ కు సపోర్ట్ గా నిలబడ్డారు. ఆయన ఫ్యామిలీని ఓదార్చడంతో పాటు.. ట్రీట్మెంట్ ను పరిశీలిస్తున్నారు. సీఐడీలో దయా పాత్రను పోషించిన దయానంద్ శెట్టి, దినేష్ ఆరోగ్యం గురించి లెటెస్ట్ అప్‌డేట్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. దినేష్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడిప్పుడే మెరుగుపడుతుందని అన్నారు. దినేష్ శరీరం చికిత్సకు స్పందిస్తుందని.. దినేష్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించాలని అన్నారు.

Updated On 5 Dec 2023 4:36 AM GMT
Ehatv

Ehatv

Next Story