గుండెపోటుకు(heart attack) గురై.. కొంత కాలంగా ముంబయ్ హాస్పిటల్(Mumbai Hospital) లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న సీఐడి నటుడు దినేష్ ఫడ్నిస్(Dinesh Phadnis) కన్నుమూశారు. ఆయన మరణ వార్తతో బాలీవుడ్ దిగ్బ్రాంతికి గురయ్యింది.

గుండెపోటుకు(heart attack) గురై.. కొంత కాలంగా ముంబయ్ హాస్పిటల్(Mumbai Hospital) లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న సీఐడి నటుడు దినేష్ ఫడ్నిస్(Dinesh Phadnis) కన్నుమూశారు. ఆయన మరణ వార్తతో బాలీవుడ్ దిగ్బ్రాంతికి గురయ్యింది.

ఈనెల 1న గుండె పోటు రావడంతో.. ముంబయ్ లోని తుంగా హాస్పిటల్ లో చేరిన సిఐడి నటుడుదినేష్ కన్నుమూశారు. పరిస్థితి విషయమించడంతో వెంటిలేటర్ పై ఉన్న ఆయన తుది శ్వాస విడిచారు. దేశ వ్యాప్తంగా CID సీరియల్(CID Serials) కు ఎంత ప్రేక్షకాదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈసీరియల్ హిందీతో పాటు తెలుగు ప్రజల మనసులు కూడా దోచింది. ఈ సీరియల్ లో కామెడీ ఆఫీసర్ ప్రణీత్ గా ఫేమస్ అయ్యారు దినేష్ ఫడ్నీస్. ఆయన రాత్ర 12 గంటలకు తుది స్వాస విడిచారు.

పరిస్థితి విషమంగా ఉందని హాస్పిటల్లో చేరినప్పుడు డాక్టర్లు చెప్పారు. వెంటిలేటర్ పై ట్రీట్మెంట్ ఇస్తూ.. ఎన్నిప్రయత్నాలు చేసినా.. దినేష్ ను కాపాడలేకపోయారు డాక్టర్లు.తన ఎక్స్ ప్రెషన్స్ తో , కామెడీ టైమింగ్ తో నవ్వించేవారు దినేష్. భయంకలిగిన ఆఫీసర్ గా.. ఆయన యాక్టింగ్ అందరిని ఆకట్టుకుంది. ముఖ్యంగా డాక్టర్ రాహుల్ తో ప్రణీత్ క్యారెక్టర్ లో దినేష్ సీన్స్ అద్బుతంగా పండాయి. ఇక హస్పిటల్ లో ఉన్న దినేష్ కోసం.. సీఐడీ యాక్టింగ్ టీమ్ చాలా కష్టపడ్డారు. ఆయన్ను బ్రతికించుకోవడం కోసం.. ఈ నటులలో ఒకరైన సీఐడీలో దయా పాత్రను పోషించిన దయానంద్ శెట్టి(Dhayanand shetty) దగ్గరుండి చూసుకున్నారు. కాని దినేష్ పరిస్థితి విషమించడంతో ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు.

దినేష్ మరణంతో బాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. హిందీ టెలివిజన్ తారలు ఆయన మృతికి సంతాపాలు ప్రకటిస్తున్నారు. ఇక దినేష్ అంత్యక్రియలు బోరీవాలీలోని దౌలత్ స్మశాన వాటికలో ఈరోజు జరగబోతున్నాయి. టెలివిజన్ చరిత్రలో సంచలనం సృష్టించిన సీరియల్ అంటే ముందు వరసలో CID ఉంటుంది. బుల్లితెర పై లాంగ్ టైమ్ ప్లే అయిన సీరియల్ కూడా CIDనే. విశేష ప్రజాదరణ ఆదరణ పొందిన సీరియల్ ఏదీ అంటే ఠక్కున CID పేరు వస్తుందతి. అలా ఆడియన్స్ ను అరిస్తూ వచ్చిన ఈసీరియల్ హిందీతో పాటు.. తెలుగులో కూడా ఈసీరియల్ కు మంచి ఆదరణ ఉంది. అంతలా ప్రేక్షకులను టీవీలకు కట్టిపడేసిన క్రైమ్ అండ్ సస్పెన్షనల్ టీవీ సిరీస్ సీఐడీ. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలకు ఇదిఫ్యావరేట్ సీరియల్.

Updated On 5 Dec 2023 6:54 AM GMT
Ehatv

Ehatv

Next Story