అప్పుడెప్పుడో మూడేళ్ల కిందట హీరోయిన్‌ కరీనా కపూర్‌(Kareena Kapoor) ఓ పుస్తకరం రాసింది. సెలబ్రిటీ రాసిన బుక్కు(Book) కాబట్టి బాగానే అమ్ముడయ్యింది. మూడేళ్ల కిందట విడుదలైన పుస్తకం ఆమెకు అప్పుడు లాభాలను, ఇప్పుడు లీగల్‌ నోటీసులు(Legal notices) తెచ్చిపెట్టింది. ఆమె కడుపుతో(Pregnancy) ఉన్నప్పుడు తన అనుభవాలు, గర్భిణిలకు చిట్కాలతో కరీనా ఓ పుస్తకాన్ని రాసి ప్రచురించి దానికి ప్రెగ్నెన్సీ బైబిల్‌(Pregnancy bible) అని పేరు పెట్టింది.

అప్పుడెప్పుడో మూడేళ్ల కిందట హీరోయిన్‌ కరీనా కపూర్‌(Kareena Kapoor) ఓ పుస్తకరం రాసింది. సెలబ్రిటీ రాసిన బుక్కు(Book) కాబట్టి బాగానే అమ్ముడయ్యింది. మూడేళ్ల కిందట విడుదలైన పుస్తకం ఆమెకు అప్పుడు లాభాలను, ఇప్పుడు లీగల్‌ నోటీసులు(Legal notices) తెచ్చిపెట్టింది. ఆమె కడుపుతో(Pregnancy) ఉన్నప్పుడు తన అనుభవాలు, గర్భిణిలకు చిట్కాలతో కరీనా ఓ పుస్తకాన్ని రాసి ప్రచురించి దానికి ప్రెగ్నెన్సీ బైబిల్‌(Pregnancy bible) అని పేరు పెట్టింది. 2021లో రిలీజైన ఆ పుస్తకం బాగా అమ్ముడయ్యింది. కరీనాకు, పబ్లిషర్‌కు మంచి లాభాలే తెచ్చపెట్టింది. ఇప్పుడు లీగల్‌ సమస్యలు తీసుకొచ్చింది. అందుకు కారణం పుస్తకం పేరులో బైబిల్‌ అనే పదాన్ని వాడటమే! తను గర్భందాల్చి పుస్తకరం రాసి, దానికి బైబిల్‌ అని పేరు పెట్టడమేమిటన్నది క్రిస్టోఫర్‌ ఆంథోనీ(Christopher Anthony) అనే పెద్దమనిషికి వచ్చిన ఆగ్రహం. ఆ కోపంతోనే మధ్యప్రదేశ్‌ హైకోర్టుకెళ్లాడు. బుక్కు పేరులో బైబిల్‌ అనే పదాన్ని వాడటం ద్వారా క్రైస్తవులను కరీనా కించపరిచిందన్నది ఆయన అభియోగం. అర్జెంటుగా ఆ పుస్తకాలన్నింటినీ ఉపసంహరించుకోవాలని, మరోసారి పుస్తకాన్ని పబ్లిష్‌ చేయాల్సి వస్తే పేరు మార్చాలని ఆయన డిమాండ్‌ చేస్తున్నారు. దాంతో పాటుగా క్రైస్తవ సమాజానికి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని క్రిస్టోఫర్‌ ఆంథోనీ అంటున్నారు.

Updated On 13 May 2024 4:32 AM GMT
Ehatv

Ehatv

Next Story