ట్రిపులార్(RRR) సినిమా తర్వాత ఎన్టీఆర్(NTR) నటిస్తున్న సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. కొరటాల శివ(Koratala Shiva) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నాడు. ఆచార్య(acharya) ఫ్లాప్ నుంచి తేరుకున్న కొరటాల ఈ చిత్రాన్ని కసితో తీస్తున్నాడు.

Rajini Kanth & Chiyan Vikram
తమిళ నటుడు(Tamil Nadu) రజనీకాంత్(Rajini kanth) ఇప్పటికీ సూపర్‌స్టారే! 70 ఏళ్లుపైబడినా ఆయన సినిమాల జోరు మాత్రం తగ్గలేదు. యంగ్ హీరోలకు పోటీనిస్తున్నారు. బ్యాక్‌టు బ్యాక్ సినిమాలకు ఓకే చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన 169వ సినిమా జైలర్(Jailer) త్వరలో విడుదల కాబోతున్నది. దీనికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. రజనీ నటించిన 170వ సినిమాను జైభీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేళ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
స్టార్ హీరో చియాన్ విక్రమ్‌ను(Chiyan Vikram) ఈ సినిమా కోసం సంప్రదించాడట టీజే జ్ఞానవేళ్. ఇందులో విలన్ పాత్రలో నటించమని జ్ఞానవేళ్ చేసిన రిక్వెస్ట్‌ను విక్రమ్ కాదనన్నాడట! అయితే ఈ విషయమై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. రజనీకాంత్- విక్రమ్ కాంబినేషన్‌లో సినిమా వస్తే చూడాలన్నది ఫ్యాన్స్ కోరిక. మరి రానున్న రోజుల్లో ఈ క్రేజీ కాంబోపై ఏదైనా అప్‌డేట్ వస్తుందేమోనని ఫాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. రజినీకాంత్‌ను జ్ఞానవేళ్ ఎలాంటి పాత్రలో చూపిస్తారో చూడాలి.
