ఆయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాతే తెలుగు సినిమా వేగం పుంజుకుంది.

ఆయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాతే తెలుగు సినిమా వేగం పుంజుకుంది. డ్యాన్స్‌లలో(Gance) కొత్తదనం వచ్చింది. ఫైట్స్‌లో(Fights) దూకుడు పెరిగింది. ఆయనే శివశంకర వరప్రసాద్‌. అభిమానులందరూ ముద్దుగా పిల్చుకునే చిరంజీవి(Chiranjeevi). నిజంగానే ఆయన వెండితెరకు ఓ వరం. అక్షయ ప్రసాదం. ఎన్నో అవార్డులు, మరెన్నో రివార్డులు ఆయనను వరించాయి. ఇప్పుడు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు(Guinness World Record). 156 చిత్రాలు... 537 పాటలు... 24 వేల డ్యాన్స్‌ మూమెంట్స్‌... ఆ 24వేల డ్యాన్స్‌ మూమెంట్స్‌ అంటే మాటలు కాదుగా! ఇవే వరల్డ్‌ రికార్డును తెచ్చిపెట్టాయి. యాక్టర్, డ్యాన్సర్‌ విభాగంలో మోస్ట్‌ ప్రొలిఫిక్‌ ఫిల్మ్‌ స్టార్‌(Profolic film star) ఇన్‌ ది ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ పేరిట గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ వారు చిరంజీవిని ఈ రికార్డ్‌కి ఎంపిక చేశారు. ఆదివారం జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బాలీవుడ్‌ స్టార్‌ ఆమిర్‌ ఖాన్‌ మెగాస్టార్‌ చిరంజీవికి ఈ రికార్డ్‌ని అందజేశారు. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ ప్రతినిధి రిచర్డ్‌ స్టెన్నింగ్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి తనకు ఈ గౌరవాన్ని దక్కించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకున్నారు. నటనకు అవార్డులు వస్తాయని తెలుసు కానీ ఇలా డ్యాన్సులకు రావడం అనేది ఊహించలేదన్నారు. తనకు నటన మీదకన్నా డ్యాన్స్‌ మీద ఆసక్తి ఎక్కువని, బహుశా అదే తనకు ఈ అవార్డు తెచ్చిపెట్టి ఉంటుందని అనుకుంటున్నానని చిరంజీవి తెలిపారు. 'గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌కి, మనకు సంబంధం ఏంటి? అని అనుకుంటాం కదా. అందుకని ఈ రికార్డు గురించి నాకు ఊహే లేదు. డ్యాన్స్‌ అనేది నాకు అదనపు అర్హత అయితే నా కొరియోగ్రాఫర్‌లు, నా ఈ విజయంలో నా దర్శక–నిర్మాతలు, అభిమానుల పాత్ర మరువలేనిది' అని మెగాస్టార్‌ అన్నారు. 'చిన్నప్పుడు వివిధభారతి, రేడియో సిలోన్‌లో వచ్చే పాటలకు డ్యాన్సులు చేసేవాడిని. రేడియోల్లో పాటలు రాగానే, శంకర్‌బాబు ని పిలవండి. డ్యాన్సులు వేస్తాడు అనేవారు. ఉత్సాహంగా స్టెప్పులు వేసేవాడిని. ఎన్‌సీసీలో చేరాక సాయంత్రాల్లో తిన్నాక అల్యూమినియమ్‌ ప్లేట్లను తిరగేసి వాయించి డ్యాన్సులు వేసేవాడిని' అని పాత విషయాలను గుర్తు చేసుకున్నారు. 'ఒకసారి రాజమండ్రిలో షూటింగ్‌ జరుగుతున్నప్పుడు సాయంత్రం సావిత్రి, రోజా రమణి, కవిత, నరసింహరాజు... ఇలా అందరూ ఓ పంచలో కూర్చున్నారు. సన్నగా వర్షం పడుతోంది. నన్ను డ్యాన్స్‌ చేయమని అడిగారు. వర్షానికి కాలు జారి కిందపడినా ఆపలేదు. దాన్ని నాగిని డ్యాన్సులాగా మార్చేసి స్టెప్పులేశాను. అక్కడున్న కో–డైరక్టర్‌ చూసి దర్శకుడు క్రాంతికుమార్‌గారికి చెప్పారు. ప్రాణం ఖరీదుకి నన్ను తీసుకున్నప్పుడు ఏలియల్లో ఏలియల్లో ఎందాక... అనే పాటను పెట్టారు. ఆ పాటకు స్టెప్‌ వేశాను. దానికన్నా ముందు పునాది రాళ్లులోనూ డ్యాన్స్‌ వేస్తూ, సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచాను' అంటూ సినిమాల్లోకి వచ్చిన కొత్త రోజులను మననం చేసుకున్నారు మెగాస్టార్‌. 'చిరంజీవిగారు ఫోన్‌ చేసి, ఈవెంట్‌కి రావాలని అడిగినప్పుడు ‘అడగకూడదు... మీరు ఆర్డర్‌ వెయ్యాలి’ అన్నాను. చిరంజీవిగారి డ్యాన్సులు ఎందుకు బాగుంటాయంటే ఆ డ్యాన్సుల్లో ఆయన మనసు కనబడుతుంది. తనని తాను ఎంజాయ్‌ చేస్తూ డ్యాన్స్‌ చేస్తారు కాబట్టి చూడ్డానికి మనకు రెండు కళ్లూ సరిపోవు' అని అమీర్‌ఖాన్‌ అన్నారు. చిరంజీవి ఓ పెన్నుని బహుమతిగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కోదండ రామిరెడ్డి, కె. రాఘవేంద్ర రావు, బి. గోపాల్, గుణశేఖర్, బాబీ, వశిష్ఠ, అశ్వనీదత్, కేఎస్‌ రామారావు, అల్లు అరవింద్, డి. సురేష్‌బాబు, శ్యామ్‌ప్రసాద్‌ రెడ్డి, తమ్మారెడ్డి భరద్వాజ, పి. కిరణ్, చిరంజీవి కుటుంబ సభ్యులు సుష్మిత, వరుణ్‌ తేజ్, సాయిధరమ్‌ తేజ్, వైష్ణవ్‌ తేజ్‌ పాల్గొన్నారు. కొసమెరపు ఏమిటంటే చిరంజీవి నటించిన ప్రాణం ఖరీదు 1978 సెప్టెంబర్‌ 22న విడుదలైంది. ఈ సినిమా విడుదలైన రోజునే చిరంజీవి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ అందుకోవడం .

Eha Tv

Eha Tv

Next Story