రామ మందిరం(Rama Mandir)లో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా సినీ రాజకీయ ప్రముఖులు హాజరువుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు ప్రముఖులు అయోధ్యకు చేరుకున్నారు.
రామ మందిరం(Rama Mandir)లో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా సినీ రాజకీయ ప్రముఖులు హాజరువుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు ప్రముఖులు అయోధ్యకు చేరుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu), మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) అయోధ్యకు వెళ్లారు. అయోధ్య(Ayodhya)లో రామ మందిర ప్రారంభోత్సవంలో పాల్గొనే అవకాశం రావడంపై చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. భావోద్వేగంతో ఉక్కిరిబిక్కిర అవుతున్నట్టు తెలిపారు. తన ఇష్టదైవం హనుమంతుడే ఈ ఆహ్వానం పంపినట్టు భావిస్తున్నట్టు వ్యాఖ్యానించారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం దక్కడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఇది చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే కార్యక్రమమని, తనకు ఈ క్షణాలు జీవితాంతం గుర్తుంటాయని వ్యాఖ్యానించారు. ఇదంతా ఆ భగవంతుడి ఆశీర్వాదమని అన్నారు. చిరంజీవి వెంట ఆయన తనయుడు రామ్ చరణ్(Ram Charan) కూడా అయోధ్యకు వెళ్లారు. ఇదిలావుంటే.. ఈ మధ్యాహ్నం 12.20 గంటలకు జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా 7 వేల మంది ప్రముఖులు హాజరవుతున్నారు.