ఎప్పుడు రిలీజవుతుందో తెలియదట!

మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi) నటిస్తున్న విశ్వంభర(Vishwambara) సినిమా కోసం కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్న అభిమానులకు నిరాశ కలిగించే వార్త ఇది! విశ్వంభర సినిమా సంక్రాంతికి(Sankranthi) రావడం లేదట! ఎప్పుడు రిలీజవుతుందో తెలియదట! నిజానికి విశ్వంభర సినిమాను సంక్రాంతి పండుగకు రిలీజ్‌ చేస్తామని మేకర్స్‌ ఇదివరకు చెప్పారు. ఇప్పుడు పోస్ట్‌పోన్‌ చేసుకున్నారు. అందుకు కారణం మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌(Ram charan) నటిస్తున్న గేమ్‌ఛేంజర్‌(Game changer) సినిమా సంక్రాంతి కానుకగా వస్తుండటమే! మొదట ఈ సినిమాను క్రిస్మస్‌ కానుకగా విడుదల చేద్దామనుకున్నారు. అయితే డిసెంబర్‌లో పుష్ప -2(Pushpa-2) సినిమా విడుదల కానున్న నేపథ్యంలో క్రిస్మస్‌ కంటే సంక్రాంతి అయితేనే బెటరనే భావనకు వచ్చారు మూవీ మేకర్స్‌. . అయితే సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి విశ్వంభ‌ర సినిమా విడుదల కావాల్సి ఉంది. ఈ విషయాన్ని ఎప్పుడో అనౌన్స్‌ చేశారు. అయితే విశ్వంభర సినిమాను గేమ్ ఛేంజ‌ర్ కోసం వాయిదా వేసుకున్నారు. దీనిపై నిర్మాత దిల్ రాజు కూడా వీడియో రూపంలో అధికారిక ప్ర‌క‌ట‌న ఇచ్చాడు. విశ్వంభ‌ర సినిమా వాయిదాపై లేటెస్ట్‌గా దర్శకుడు వశిష్ట కూడా స్పందించాడు. ద‌స‌రా కానుక‌గా విశ్వంభ‌ర టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు మేక‌ర్స్. కార్యక్రమంలో ద‌ర్శ‌కుడు వ‌శిష్ట మాట్లాడారు. మొన్న‌టి వ‌ర‌కు సంక్రాంతికే విడుదల చేద్దామని అనుకున్నాం. కానీ గేమ్ ఛేంజ‌ర్ సంక్రాంతికి విడుద‌ల చేయ‌నున్న‌ట్లు దిల్ రాజు తమను సంప్ర‌దించారు. ఈ విషయంపై చిరంజీవి కూడా సానుకూలంగా స్పందించారు. విశ్వంభర సినిమా షూటింగ్ ఇప్ప‌టికే పూర్తయ్యంది. కానీ రామ్ చ‌ర‌ణ్, దిల్‌రాజుల‌(Dilraju) కోసం విశ్వంభ‌ర‌ వాయిదా వేస్తున్నాం అంటూ వ‌శిష్ట చెప్పుకోచ్చాడు.

Eha Tv

Eha Tv

Next Story