ఆరడుగుల బుల్లెట్‌ అన్నారు. సింహం అన్నారు. సప్త సముద్రాలను అవలీలగా ఈదేసే గజ ఈతగాడన్నారు. లేస్తే హరిహరాదులు కూడా ఆపలేరంటూ బిల్డప్‌ ఇచ్చారు. కూటమిని విజయతీరాలకు చేర్చే సరంగు ఇతడేనన్నారు. ఇవన్నీ జనసేన(Janasena) అధినేత పవన్‌ కల్యాణ్‌కు(Pawan kalyan) ఇచ్చిన విశేషణాలు.. ఇంకా చాలా చాలా అన్నారు. ఆయనను ఎంతగా ఆకాశాన్నికెత్తేశారంటే పొగడ్తలే సిగ్గుపడేంతగా! సినిమాలలో పవన్‌ చేసే విన్యాసాలు చూసి ఇవన్నీ నిజమేకాబోలనుకున్నారు అభిమానులు.

ఆరడుగుల బుల్లెట్‌ అన్నారు. సింహం అన్నారు. సప్త సముద్రాలను అవలీలగా ఈదేసే గజ ఈతగాడన్నారు. లేస్తే హరిహరాదులు కూడా ఆపలేరంటూ బిల్డప్‌ ఇచ్చారు. కూటమిని విజయతీరాలకు చేర్చే సరంగు ఇతడేనన్నారు. ఇవన్నీ జనసేన(Janasena) అధినేత పవన్‌ కల్యాణ్‌కు(Pawan kalyan) ఇచ్చిన విశేషణాలు.. ఇంకా చాలా చాలా అన్నారు. ఆయనను ఎంతగా ఆకాశాన్నికెత్తేశారంటే పొగడ్తలే సిగ్గుపడేంతగా! సినిమాలలో పవన్‌ చేసే విన్యాసాలు చూసి ఇవన్నీ నిజమేకాబోలనుకున్నారు అభిమానులు. రీల్‌ లైఫ్‌ వేరు, రియల్‌ లైఫ్‌ వేరు అన్నది పాపం ఫ్యాన్స్‌ ఇంకా తెలుసుకోలేదు. ఇప్పుడు పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పవన్‌ కల్యాణ్‌ పోటీ చేస్తున్నారు కదా! కూటమి తరఫున బరిలో దిగాడు కాబట్టి ఈజీగా విజయం సాధించేస్తాడనుకున్నారు. ఎందుకంటే పడేవి ఒక్క జనసేన ఓట్లే కావుగా.. టీడీపీ, బీజేపీ ఓట్లు కూడా పవన్‌కే పడతాయి. ఈ దెబ్బతో జగన్‌(Jagan) పార్టీ పిఠాపురం(Pithapuram) నుంచి పెట్టాబేడా సర్దుకుని వెళ్లిపోవాల్సిందేనని జనసైనికులు చెప్పుకున్నారు.

రాజకీయాలంటే సినిమా కాదు. సినిమాల్లో చేసినట్టు రాజకీయాల్లో చేయడం కుదరదు. గ్రాఫిక్స్‌ సాయంతో వంద మందిని ఒంటిచెత్తో కొట్టినట్టు కాదు, ప్రజల మనసులను గెలవడం. ప్రజల మద్దతు పొందడం అంత ఆషామాషీ కాదు. తన సభలకు వచ్చే జనాన్ని చూసి తనకు తిరుగులేదనుకోవడం కంటే అమాయకత్వం మరోటి ఉండదు. ఎన్టీఆర్‌ అంతటి వ్యక్తికే ఓటములు తప్పలేదు. అంతెందుకు మెగాస్టార్‌ చిరంజీవి(chiranjeevi) కూడా పాలకొల్లులో పరాజయం పాలైన విషయం అనుంగు సోదరుడికి తెలియకుండా ఎలా ఉంటుంది? ప్రజల మెప్పు పొందాలంటే గుణగణాలు చాలా అవసరం. నడవడిక, ప్రవర్తన, వ్యవహారశైలి బాగుంటే తప్ప జనం వెంట నడవరు. పవన్‌ కల్యాణ్‌ ఫుల్‌ టైమ్‌ పొలిటిషినేమీ కాదు. ఆయన పార్ట్‌ టైమ్‌ రాజకీయనాయకుడు.

జనసేన పార్టీని పెట్టింది తను ముఖ్యమంత్రి అవ్వడానికి కాదు. మరొకరికి ఆ పదవిని అప్పగించడానికేనని జనాలకు తెలిసిపోయింది. ముఖ్యమంత్రి జగన్‌ను పట్టుకుని గుడ్డలూడదీసి కొడతాను. సంకెళ్లు వేస్తాను అనడాన్ని జనం హర్షించరన్న సంగతి పవన్‌కు ఇప్పుడు తెలిసి వచ్చింది. పిఠాపురం బరిలో దిగినప్పుడు ఆయన మొహంలో గెలుపు ధీమా కనిపించింది. ఇప్పుడు ఆయనలో ఆందోళన కనిపిస్తోంది. అందుకు కారణం ఆయన ప్రత్యర్థి వంగా గీత బలమైన నాయకురాలు కాబట్టి. మూడు దశాబ్దాలుగా ఆమె ప్రజలలో ఉంటూ మచ్చలేని నాయకురాలుగా పేరు గడించారు. గతంలో రెండు చోట్లా ఓడిపోయిన పవన్ కల్యాణకు ఈసారి ఎలాగైనా చట్టసభలో అడుగుపెట్టాలనే కోరిక బలపడింది. అయితే ఇప్పుడు పిఠాపురంలో కూడా మొదట ఉన్నంత సానుకూలత కనిపించడం లేదు.

ఆదుకుంటాడు అనుకున్న వర్మ చివరలో హ్యాండిచ్చారు. జబర్దస్త్ నటులతో చేయించిన ప్రచారం ప్రజలను నవ్వించింది. పవన్‌ను నవ్వులపాలు చేసింది. పవన్‌ ఎన్ని డైలాగులు కొట్టినా, ఎన్ని యాక్షన్లు చేసినా జనం దృష్టిని ఆకర్షించడం లేదు. మరోవైపు గీత మాత్రం ఇంటింటికి తిరుగుతూ మీ ఇంటి ఆడబిడ్డను అని చెప్పుకుంటూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. గెలిచినా ఓడినా తాను ఇక్కడే ఉంటానని, కానీ అవతలి వ్యక్తి కోసం ఏ హైదరాబాదో, ఏ మద్రాస్‌కో వెళ్లాల్సి వస్తుందని, షూటింగ్‌ ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్లాల్సి వస్తుందని చెబుతూ ప్రజలలో ఆలోచన రేకెత్తించారు. తన గ్రాఫ్‌ రోజురోజుకు తగ్గిపోతుండటంతో చివరి అస్త్రంగా మెగాస్టార్‌ చిరంజీవిని రంగంలోకి దించారు. చిరంజీవి కూడా తమ్ముడి గుణగణాలను, వీరగాధలను ఉదహరిస్తూ పాపం పిల్లడు గుక్కపట్టి ఏడుస్తున్నాడు..గెలిపించండి... ఈసారైనా గెలిపించండి..లేకుంటే అవమానభారంతో చచ్చేలా ఉన్నాడు అని విజ్ఞప్తి చేశారు. చివరికి పవన్‌ పరిస్థితి ఇక్కడికి వచ్చింది. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయగలిగినంత సత్తా, చరిష్మా ఉందని అనుకుంటున్న పవన్‌ ఇప్పుడు అన్నతో వీడియో పోస్ట్‌ చేయించుకునే స్థితి వచ్చింది.

Updated On 7 May 2024 4:16 AM GMT
Ehatv

Ehatv

Next Story