కుర్ర హీరోలు కూడా కుళ్లుకునేలా.. వరుస సినిమాలు లైన్ లో పెడుతున్నాడు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi ). 70 ఏళ్ళకు దగ్గరలో ఉన్న ఆయన నెక్ట్స్ సినిమాను స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్(Bhola Shankar) రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఇలా రిలీజ్ అయ్యిందో లేదో.. అలా మరో సినిమాను లైన్ అప్ చేస్తున్నాడు మెగాస్టార్. ఇప్పటికే నెక్ట్స్ సినిమాలకు సబంధించి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఈ వయస్సులో కూడా ఏమాత్రం గ్యాప్ లేకుండా […]

కుర్ర హీరోలు కూడా కుళ్లుకునేలా.. వరుస సినిమాలు లైన్ లో పెడుతున్నాడు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi ). 70 ఏళ్ళకు దగ్గరలో ఉన్న ఆయన నెక్ట్స్ సినిమాను స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు.

మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్(Bhola Shankar) రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఇలా రిలీజ్ అయ్యిందో లేదో.. అలా మరో సినిమాను లైన్ అప్ చేస్తున్నాడు మెగాస్టార్. ఇప్పటికే నెక్ట్స్ సినిమాలకు సబంధించి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఈ వయస్సులో కూడా ఏమాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు ప్రస్తుతం భోళా శంకర్ సినిమా హాడావిడిలో ఉన్నాడు చిరు. మెహర్ రమేష్ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో తమన్నా(Tamannah) హీరోయిన్ గా నటించింది. ఇక ఈమూవీ హడావిడి అయిపోయింది. ఇక మరో రెండు సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడుచిరు.

ఇక నెక్ట్స్ మెగాస్టార్ చిరంజీవి.. బింబిసార ఫేమ్ మల్లిడి వశిష్ట(Mallidi Vasishta)తో సినిమా చేయబోతున్నాడు. మెగా 157 గా ఈమూవీ తెరకెక్కబోతున్నట్టు సమాచారం. కళ్యాన్ రామ్ కు మంచి హిట్ అందించాడు వశిష్ట. ఈసినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. దాంతో మెగాస్టార్ కూడా నమ్మకంతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అసలు చిరంజీవి ముందుగా వెంకీ కుడుములతో ఈమూవీ చేయాలి అనుకున్నాడు డివివి దానయ్య నిర్మాతగా.. సినిమా కూడా అనౌన్స్ చేశారు. ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి.

కాని ఏమైందో తెలియదు కాని.. ఆతరువాత కొన్ని కారణాలు వల్ల ఈసినిమా క్యాన్సిల్ అయ్యింది. దాంతో ఇక మెగా 157 సినిమా చేసే ఛాన్స్ వశిస్టకు వచ్చి చేరింది. ఇక ఈమూవీనీ కూడా చాలా త్వరగా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ బజ్ ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ రూమర్స్ నిజమైతే నవంబర్‌లో సినిమా అట్టహాసంగా ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. దీనిపై మేకర్స్ ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ప్రముఖ ప్రొడక్షన్ బ్యానర్ అయిన యూవీ క్రియేషన్స్ ఈ భారీ ప్రాజెక్ట్‌ ను నిర్మించనుంది. ఇది ఒక సోషియో ఫాంటసీ డ్రామా అని తెలుస్తోంది. ఈ మూవీకి సంబందించిన వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

Updated On 11 Aug 2023 6:37 AM GMT
Ehatv

Ehatv

Next Story