మెగాస్టార్ చిరంజీవి మంచి దూకుడు మీద ఉన్నాడు. వరుస సినిమాలు లైన్ చేస్తున్నాడు. ఇప్పటికే మోహార్ రమేష్ డైరెక్షన్ లో నటిస్తోన్న భోళా శంకర్ సినిమా రిలీజ్ కు ముస్తాబవుతుండగా....మరో రెండు సినిమాలకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అందులో మరీ ముఖ్యంగా కింగ్ నాగార్జునతో సోగ్గాడే చిన్నినాయనే, బంగార్రాజు సినిమాలు తెరకెక్కించిన కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంతో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చాడు మెగాస్టార్. ఇక ఈసినిమా అనౌన్స్ మెంట్ వచ్చిందో లేదో.. అప్పుడు ఈమూవీపై గాసిప్స్ స్టార్ట్ అయ్యాయి.

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కింగ్ నాగార్జున దర్శకుడితో సినిమా చేయడానికిరెడీ అవుతున్నాడు. అయితే ఈసినిమాలో స్పెషల్ ఏంటీ అటే.. మెగాస్టార్ చిరంజీవితో త్రిష 17 ఏళ్ళ తరువాత జతకట్టబోతోంది.

మెగాస్టార్ చిరంజీవి మంచి దూకుడు మీద ఉన్నాడు. వరుస సినిమాలు లైన్ చేస్తున్నాడు. ఇప్పటికే మోహార్ రమేష్ డైరెక్షన్ లో నటిస్తోన్న భోళా శంకర్ సినిమా రిలీజ్ కు ముస్తాబవుతుండగా....మరో రెండు సినిమాలకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అందులో మరీ ముఖ్యంగా కింగ్ నాగార్జునతో సోగ్గాడే చిన్నినాయనే, బంగార్రాజు సినిమాలు తెరకెక్కించిన కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంతో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చాడు మెగాస్టార్. ఇక ఈసినిమా అనౌన్స్ మెంట్ వచ్చిందో లేదో.. అప్పుడు ఈమూవీపై గాసిప్స్ స్టార్ట్ అయ్యాయి.

తాజాగా ఈ సినిమాకు సబంధించి ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్‌ ఒకటి ఫిలింనగర్ సర్కిల్‌లో చక్కర్లు కొడుతోంది. మెగాస్టార్ చిరంజీవి జోడీగా చెన్నై చిన్నది త్రిష నటించబోతుననట్టు తెలుస్తోంది. అయితే ఈ ఇద్దరు స్టార్లు స్టాలిన్‌లో కలిసి నటించారు. ఆతరువాత మరే సినిమా చేయలేదు. అయితే గతంలో ఆచార్య సినిమాలో త్రిషను తీసుకున్నారు. అయితే కొన్ని క్రియేటీవ్ డిఫరెన్స్ ల వల్ల .. ఈ సినిమా నుంచి త్రిష తప్పకుంది ఆమె స్వయంగా ప్రకటన కూడా చేసింది.

అయితే కళ్యాణ్ కృష్ణ (Kalyan Krishna) మెగాస్టార్ తో చేయబోయే ఈసినిమాలో త్రిష దాదాపు ఫిక్స్ అయినట్టే అంటున్నారు. రీసెంట్ గా కళ్యాణ్ కృష్ణ త్రిషను సంప్రదించాడట. అయితే త్రిష ఈ సినిమా కథ విని వెంటనే ఓకే చేసిందని టాక్ గట్టిగా నడుస్తోంది. అఫీషియల్ గా కూడా తర్వలో అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే 17 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత కలిసి నటించబోతున్నారన్నారు. మెగాస్టార్ చిరంజీవి, త్రిష.

అయితే ఈసినిమా కథ ప్రకారం తండ్రీకొడుకుల స్టోరీతో రాబోతుండగా.. చిరంజీవి తండ్రి, కొడుకున పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది.లేటెస్ట్‌ టాక్‌ ప్రకారం చిరంజీవి భార్య పాత్రలో త్రిష నటించనుంది. టైటిల్‌తోపాటు ఇతర వివరాలై త్వరలోనే క్లారిటీ ఇవ్వనుంది చిరు టీం. ఈ చిత్రం ఆగస్టులో గ్రాండ్‌గా ప్రారంభం కానుంది.

Updated On 28 Jun 2023 8:04 AM GMT
Ehatv

Ehatv

Next Story