చాలా రోజులుగా మెగాస్టార్‌ చిరంజీవి మోకాలి నొప్పులతో(Knee pains) బాధపడుతున్నారు. ఓ వయసు వచ్చిన తర్వాత ఇది కామనే అనుకోండి. పైగా చిరంజీవి సినిమాల్లో విపరీతంగా ఫైట్లు, డ్యాన్సులు చేస్తుంటారు. కాబట్టి ఆయనకు మోకాలి నొప్పులు రావడం సహజమే. సర్జరీ తప్పనిసరి అని డాక్టర్లు చెప్పినప్పటికీ చాన్నాళ్లుగా శస్త్రచికిత్సను(treatment) వాయిదా వేస్తూ వస్తున్నారు చిరంజీవి. ఇప్పుడు ఇక తప్పదు కాబట్టి చేయించాలని డిసైడ్‌ అయ్యారట!

చాలా రోజులుగా మెగాస్టార్‌ చిరంజీవి మోకాలి నొప్పులతో(Knee pains) బాధపడుతున్నారు. ఓ వయసు వచ్చిన తర్వాత ఇది కామనే అనుకోండి. పైగా చిరంజీవి సినిమాల్లో విపరీతంగా ఫైట్లు, డ్యాన్సులు చేస్తుంటారు. కాబట్టి ఆయనకు మోకాలి నొప్పులు రావడం సహజమే. సర్జరీ తప్పనిసరి అని డాక్టర్లు చెప్పినప్పటికీ చాన్నాళ్లుగా శస్త్రచికిత్సను(treatment) వాయిదా వేస్తూ వస్తున్నారు చిరంజీవి. ఇప్పుడు ఇక తప్పదు కాబట్టి చేయించాలని డిసైడ్‌ అయ్యారట! అయితే ఈ ఆపరేషన్‌ హైదరాబాద్‌లో జరుగుతుందా? లేక విదేశాలకు వెళ్లి ట్రీట్‌మెంట్‌ తీసుకుంటారా? ఈ రెండూ కాకపోతే దేశంలో మరే నగరంలోనైనా సర్జరీ చేయించుకుంటారా అన్నది ఇంకా తెలియరాలేదు. ఆయనకు, ఆయన ఫ్యామిలీకి మాత్రం ఈ విషయం తెలుసు అని అంటున్నారు.

ఈ వారంలోనే సర్జరీ చేయించుకుని ఓనెలనో, నెలన్నరనో విశ్రాంతి తీసుకోవాలని చిరంజీవి అనుకుంటున్నారట! ఆ తర్వాతే మళ్లీ సెట్స్‌లో అడుగుపెట్టాలని డిసైడ్‌ అయ్యారట!ఇదిలా ఉంటే భోళాశంకర్‌(Bholashankar) సినిమా ఫలితం చిరంజీవిని బాగా డిస్ట్రబ్‌ చేసింది. ఇంత దారుణంగా ఫెయిల్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. ఇందుకు కారణమేమిటో కూడా తెలియడం లేదు. జబర్దస్త్‌(Jabardast) గ్యాంగ్‌ మొత్తాన్ని తీసుకోవడం వల్లే సినిమా స్థాయి చాలా మట్టుకు తగ్గిందని కొందరు విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతానికి చిరంజీవి కల్యాణ్‌ కృష్ణ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నారు. కథా చర్చలు అయితే అయ్యాయి. ప్రీ ప్రొడక్షన్‌ పనులు కూడా మొదలుపెట్టారని అంటున్నారు. మలయాళంలో హిట్‌ కొట్టిన బ్రో డాడి ఆధారంగా ఈ సినిమాను తీస్తున్నారు. ఈ సినిమాను ఎలా తయారుచేయాలి? మలయాళంలో పృధ్విరాజ్‌ పోషించిన పాత్రకు ఎవరిని తీసుకోవాలి అన్నది డిసైడ్‌ చేయాల్సి ఉంది. ఈ మొత్తం అయ్యే వరకు చాలా రోజులు పడుతుంది. అంటే వచ్చే ఏడాది వేసవి వరకు చిరంజీవి సినిమా రాదన్నమాట!

Updated On 14 Aug 2023 5:58 AM GMT
Ehatv

Ehatv

Next Story