మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) సెకండ్ ఇన్నింగ్స్‌లో దుమ్ము దులుపుతున్నారు. వరుస సినిమాలో అభిమానుల్లో ఉత్సాహం నింపుతున్నారు. వాల్తేర్ వీరయ్య(Walther Veeraya) సూపర్‌హిట్ కావడంతో త్వరలో విడుదల కాబోతున్న భోళాశంకర్(Bholashankar) కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మెహర్ రమేశ్(Meher Ramesh) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగస్టు 11 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.

Chiranjeevi New Look In Bholashankar
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) సెకండ్ ఇన్నింగ్స్‌లో దుమ్ము దులుపుతున్నారు. వరుస సినిమాలో అభిమానుల్లో ఉత్సాహం నింపుతున్నారు. వాల్తేర్ వీరయ్య(Walther Veeraya) సూపర్‌హిట్ కావడంతో త్వరలో విడుదల కాబోతున్న భోళాశంకర్(Bholashankar) కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మెహర్ రమేశ్(Meher Ramesh) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగస్టు 11 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఇదిలా ఉంటే లీక్స్ పేరుతో చిరంజీవి సోషల్ మీడియాలో అప్పుడప్పుడు తన సినిమాలకు సంబంధించిన సమాచారాన్ని సరదాగా అభిమానులతో పంచుకుంటుంటారు. ఆదివారం ఆయన మరోసారి ఆ ప్రయత్నం చేశారు. భోళాశంకర్‌లోని ఓ సన్నివేశాన్ని ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. దాని వెనుక సంగతులను వివరించారు.
'నా తమ్ముడు పవన్‌కల్యాణ్(Pawan kalyan) బాబు తన సినిమాలలో అప్పుడప్పుడూ నా ప్రస్తావన తీసుకొస్తూ, నా డ్యాన్సులకు స్టెప్పులేస్తూ ఉంటాడు. నా డైలాగులను అనుకరిస్తూ వినోదం పంచుతుంటాడు. అలా నేను కూడా భోళాశంకర్‌లో పవన్ మేనరిజమ్స్(Pawan mannerisms) కనబరుస్తున్నాను. కల్యాణ్ పాటను అనకరించి వినోదం పంచబోతున్నాను. మీరంతా ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను' అని చిరంజీవి రాసుకొచ్చారు. దీంతో పాటుగా పవన్ నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ఖుషీలోని(Kushi) యే మేరా జహా పాటలో పవన్ మేనరిజమ్‌ను అనుకరించిన ఓ సన్నివేశాన్ని చిరంజీవి పంచుకున్నారు. ‘తమ్ముడి పాట మస్తుందిలే...’ అంటూ అందులో చిరంజీవి చేసిన సందడి ఫాన్స్‌ను అమితంగా అలరిస్తోంది. భోళాశంకర్‌లో చిరంజీవి సరసన తమన్నా నటిస్తున్నారు. చెల్లెలి పాత్రలో మహానటి ఫేమ్ కీర్తి సురేశ్ కనిపించబోతున్నారు.
