మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi) సినిమా వస్తున్నదంటే అభిమానులకు పండగే పండగ! సినిమా విడుదలకు వారం రోజుల నుంచే హడావుడి చేస్తుంటారు. ఇక రిలీజ్‌ రోజు ఫ్యాన్స్‌ చేసే సందడి గురించి చెప్పాల్సిన పనిలేదు. థియేటర్లలో వారి హంగామా స్పెషల్‌గా ఉంటుంది. సోషల్‌ మీడియాలో ఓ రేంజ్‌లో సందడి ఉంటుంది. సినిమా హిట్టయితే ఆనందం రెట్టింపు అవుతుంది. అదే ఫ్లాప్‌ అయితే బాధపడతారు. తర్వాతి సినిమా కోసం ఎదురుచూస్తుంటారు.

మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi) సినిమా వస్తున్నదంటే అభిమానులకు పండగే పండగ! సినిమా విడుదలకు వారం రోజుల నుంచే హడావుడి చేస్తుంటారు. ఇక రిలీజ్‌ రోజు ఫ్యాన్స్‌ చేసే సందడి గురించి చెప్పాల్సిన పనిలేదు. థియేటర్లలో వారి హంగామా స్పెషల్‌గా ఉంటుంది. సోషల్‌ మీడియాలో ఓ రేంజ్‌లో సందడి ఉంటుంది. సినిమా హిట్టయితే ఆనందం రెట్టింపు అవుతుంది. అదే ఫ్లాప్‌ అయితే బాధపడతారు. తర్వాతి సినిమా కోసం ఎదురుచూస్తుంటారు. చిరంజీవి ఈ మధ్య ఎక్కువగా రీమేకలను నమ్ముకుంటున్నారు. ఒరిజినల్‌ సినిమా హిట్టయ్యింది కదా .. ఇక్కడ కూడా హిట్టవుతుందని అనుకుంటున్నారు. కానీ మనవాళ్ల టేస్ట్‌కు తగినట్టుగా సినిమా తీస్తేనే ఆడుతుంది లేకపోతే పోతుంది. ఇటీవల విడుదలైన చిరంజీవి భోళాశంకర్‌(Bhola shankar) సినిమా అభిమానులకే నచ్చలేదు. ప్రేక్షకులకు ఇక ఏం నచ్చుతుంది? అందుకే ఈ సినిమా కనీస వసూళ్లు కూడా రాబట్టడం లేదు. పెద్ద డిజాస్టర్‌గా సినిమా నిలిచింది. దీంతో మెగా ఫ్యాన్స్‌ నిరుత్సాహపడ్డారు. దర్శకుడు మెహర్‌ రమేశ్‌ను విపరీతంగా తిట్టిపోశారు. కొన్ని సీన్లపై అయితే విపరీతమైన ట్రోలింగ్‌ నడిచింది. ఈ క్రమంలో చిరంజీవి తర్వాతి సినిమా ఎవరితో అన్న చర్చ మొదలయ్యింది. ప్రస్తుతానికి నలుగురు దర్శకుడు చిరంజీవితో సినిమా తీయడానికి రెడీగా ఉన్నారు. యూవీ క్రియేషన్స్‌ పతాకంలో బింబిసార ఫేమ్‌ డైరక్టర్‌ వశిష్టతో(Vasista) ఓ సినిమా చేయనున్నట్టు ప్రచారం జరుగుతోంది. అలాగే బంగర్రాజు వంటి సూపర్‌హిట్‌ అందించిన కల్యాణ్‌ కృష్ణతోనూ(Kalyan Krishna) ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమాను చిరంజీవి పెద్ద కూతురు కొణిదెల సుష్మిత నిర్మిస్తున్నారు. ఏఆర్‌ మురుగదాస్‌ లేదా వి.వి.వినాయక్‌తోనూ(V.V Vinayak) సినిమా ఉండబోతుందని ప్రచారం జరుగుతోంది. మరి మెగాస్టార్‌ ఈ నలుగురిలో మొదట ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి? తన పుట్టిన రోజైన ఆగస్టు 22వ తేదీన చిరంజీవి నుంచి ఏమైనా అనౌన్స్‌మెంట్‌ వస్తుందా? అని ఫ్యాన్స్‌ అనుకుంటున్నారు.

Updated On 19 Aug 2023 8:10 AM GMT
Ehatv

Ehatv

Next Story