✕
Waltheru Veerayya 50 Days : వాల్తేర్ వీరయ్య 50 రోజుల పండుగ.. మళ్ళీ మెగాస్టార్ మ్యాజిక్.!
By EhatvPublished on 11 March 2023 2:28 AM GMT
వాల్తేర్ వీరయ్య హాఫ్ సెంచరీ కొట్టేసింది. సెంచరీ దిశగా పరుగులు పెడుతోంది. చాన్నాళ్ల తర్వాత మళ్ళీ మెగాస్టార్ మేజిక్ మొదలయ్యింది.. రికార్డుల హోరు .. కలెక్షన్ల జోరు చూస్తున్నాం.
ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు, అల్లుడా మజాకా ఒకటేమిటి...లెక్కలేనన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ రోజులను తలపిస్తూ మెగాస్టార్ వీరవిహారం మళ్ళీ మొదలైంది. వాల్తేర్ వీరయ్య చిత్రం సాధించిన ఘన విజయం చూసి కుళ్ళుకునే వాళ్ళకి దిమ్మతిరిగిపోయింది. ఈ ఏడు సంక్రాంతికి విడుదలైన వాల్తేర్ వీరయ్య సరికొత్త రికార్డులకు శ్రీకారం చుట్టింది.

x
waltair veerayya 50days
-
- వాల్తేర్ వీరయ్య హాఫ్ సెంచరీ కొట్టేసింది. సెంచరీ దిశగా పరుగులు పెడుతోంది. చాన్నాళ్ల తర్వాత మళ్ళీ మెగాస్టార్ మేజిక్ మొదలయ్యింది.. రికార్డుల హోరు .. కలెక్షన్ల జోరు చూస్తున్నాం. ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు, అల్లుడా మజాకా ఒకటేమిటి...లెక్కలేనన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ రోజులను తలపిస్తూ మెగాస్టార్ వీరవిహారం మళ్ళీ మొదలైంది. వాల్తేర్ వీరయ్య చిత్రం సాధించిన ఘన విజయం చూసి కుళ్ళుకునే వాళ్ళకి దిమ్మతిరిగిపోయింది. ఈ ఏడు సంక్రాంతికి విడుదలైన వాల్తేర్ వీరయ్య సరికొత్త రికార్డులకు శ్రీకారం చుట్టింది. మెగాస్టార్ స్టామినాని మరోసారి నిరూపించింది.
-
- మెగాస్టార్ రీఎంట్రీని చూసి ఓర్వలేని కొందరు కుహనా రాతగాళ్ళు మెగాస్టార్ చిరంజీవి పైన అవాకులు, చెవాకులు రాసి సంబరపడిపోవడానికి తెగప్రయత్నం చేశారు. వాళ్ళందరి ఆశలపైన మెగాస్టార్ నీళ్ళు పోశారు. తన రేంజ్ ఏమిటో మరోసారి రుచిచూపించి అభిమానులకు గర్వకారణంగా నిలిచారు మెగాస్టార్. వాల్తేర్ వీరయ్య చిత్రంతో మెగాస్టార్ నెలకొల్పిన అరుదైన రికార్డులు సాధించడం ఎవరి తరం కాదు అనే రీతిలో మెగాస్టార్ శివతాండవం చేశారు. అసలు వాస్తవాలలోకి వెళితే, తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాక్సాఫీసు స్టామినా ఇంత ఉందా అని మెగాస్టార్ చిరంజీవితోనే నిరూపణ అయిన మాట చరిత్రకి తెలిసిన నిజం. ఆయనే తెలుగు సినిమా కమర్షియల్ స్థాయిని అప్ గ్రేడ్ చేసిన ఛాంపియన్.
-
- ఓటిటిల తాకిడితో తెలుగుసినిమాగజగజలాడుతుంటే నేనున్నానని చిరంజీవి అభయం ఇచ్చారు. హోమ్ వ్యూయింగ్ అలవాటుకి అడ్డుకట్ట వేసి ధియేటర్లకి రప్పించారు. పూర్వంలా ధియేటర్ల సందడి, టిక్కెట్ల హడావుడికి తన చిత్రాల విషయంలో ఏ మాత్రం ఢోకా లేదని అండగా నిలబడ్డారు చిరంజీవి విడుదలైన తర్వాత బిక్కుబిక్కుమంటూ ఒకటీ అరా షోలతో సరిపెట్టుకుంటున్న ఈ పరిస్థితులలో చిరంజీవి అంటే ఏమిటో, ఆ దమ్ము ఏంటో కళ్ళకు కట్టినట్టు చూపించిన ఘనత ఆయనకే చెందుతుంది. చెల్లుతుంది. అందుకు వాల్తేర్ వీరయ్య ఘనవిజయమే ప్రత్యక్ష సాక్ష్యం. ఏకంగా, రెండు తెలుగు రాష్ట్రాలలో 67 డైరెక్ట్ కేంద్రాలలో 50 రోజుల రన్ అంటే అది ఇవాళ ప్రపంచ రికార్డులాటిది. ఆ రికార్డు మెగాస్టార్ సొంతం చేసుకున్నారు.
-
- వందకోట్ల షేర్ అన్నది ఎందరి కలో చెప్పలేం. రాత్రీ పగలు అందరూ దీని గురించే తపస్పు చేస్తుంటారు. అయనా కూడా అది అందరి ద్రాక్షపండులాగే ఎందరినో ఊరిస్తూనే ఉంద. అదే చిరంజీవి.....ఈ రికార్డును మెగాస్టార్ అవలీలగా మొదటివారంలోనే సాధించి పరిశ్రమకి ఇంకోసారి ప్రతిష్టాత్మక ఉదాహరణగా నిలిబడ్డారు. ఉత్తరాంధ్ర, ఈస్ట్ గోదావరి జిల్లాలయితే దుమ్ము దులిపాయని చెప్పాలి. ఈ రెండు జిల్లాలు ఇటీవలి రోజుల్లో ఓ వినూత్నమైన విడ్డూరానికి తెరతీశాయి. 50 రోజుల లెక్కలు చూస్తే మెగాస్టార్ ప్రభంజనం అర్ధమవుతుంది. 50 రోజులలో వాల్తేర్ వీరయ్య వసూలు చేసిన షేర్ అక్షరాల 20 కోట్లు.
-
- వాల్తేర్ వీరయ్యతో సమానంగా లోగడ ఈ మార్క్ అందుకున్నవి బాహుబలి, ట్రిపులార్, అల వైకుంఠపురం చిత్రాలు మాత్రమే. ఇందులో మరో తిరకాసు లెక్క దాగుంది. అదేంటంటే....ఈ సినిమాల టిక్కట్ల ధర వేరు. వాల్తేర్ వీరయ్య చిత్రానికి టిక్కట్ రేట్లు సాధారణ స్థాయిలో మాత్రమే లభ్యం కావడం అత్యంత గమనార్హం. ఆ చిత్రాల టికెట్ ధరలే అయితే వాల్తేర్ వీరయ్య షేర్ ఏ రేంజ్ లో ఉండేదే అర్ధం చేసుకోవచ్చు. తక్కువ టికెట్ రేట్లే అయినా ఇంత షేర్ కలెక్ట్ చేయడం ఎవరి వల్లా కాదు. జస్ట్ ఉదాహరణకి రాస్తున్నమాట ఇది. ఓహో అని చెప్పుకుంటున్న ట్రిపులార్ చిత్రం ఈస్ట్ గోదావరి జిల్లాలో 14 కోట్లు రాబడితే వాల్తేర్ వీరయ్య చిత్రం 50 రోజులకు గానూ 14కోట్లకు పై చిలుకే రాబడుతోంది. ఇప్పటికీ కూడా కొన్ని సెంటర్లలో వీరయ్య దాడి ఆగకుండా చెలరేగిపోతోంది.
-
- కాశీకి వెళ్ళాను .....కాషాయం కట్టుకున్నాననుకున్నారా.....అన్న మెగాస్టార్ డైలాగ్ గుర్తుందా.....గుర్తుందా కాదు గుర్తుంచుకోవాలి. ఏ ప్రాంతమైనా, ఏ సీజనైనా...ఏ సినిమా అయినా కూడా మెగాస్టార్ ముద్ర మారదు. ఆ సంతకం ఎప్పటికీ చెరగదు. అప్రతిహతమైన మెగాస్టార్ ఇమేజ్, ఆ రేంజ్ ఏ క్షణంలోనూ చెక్కు చెదరలేదని చెప్పడానికి వాల్తేర్ వీరయ్య సజీవచిత్ర నిదర్శనం. వాల్తేర్ వీరయ్య చిత్రంతో 19 కోట్ల షేర్ అందుకుని తెలుగు సినిమా సింగం తానేనని అని మెగాస్టార్ ఛాలెంజ్ విసిరారు.

Ehatv
Next Story