దసరా(Dasara) సినిమా గురించి ట్వీట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి(Mega star chiranjeevi). నానీని(NANI) డియర్ నానీ అని సంబోధిస్తూ.. టీమ్ అందరి గురించి పెద్ద నోట్ రాశారు మెగాస్టార్ చిరంజీవి. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..?

దసరా(Dasara) సినిమా గురించి ట్వీట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి(Mega star chiranjeevi). నానీని(NANI) డియర్ నానీ అని సంబోధిస్తూ.. టీమ్ అందరి గురించి పెద్ద నోట్ రాశారు మెగాస్టార్ చిరంజీవి. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..?

నేచురల్ స్టార్ నాని(Natural star nani), కీర్తి సురేష్(keerthy suresh) జంటగా.. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదేల(Srikanth Odela) తెరకెక్కించిన సినిమా దసరా. గత నెల మార్చ్ 30న పాన్ ఇండియా(Pan India) వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినమా.. బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సొంతం చేసకుంది. రిలీజ్ అయ్యి రెండు వారాలు దాటినా.. జోరు ఇంకా కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటికీ దసరా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.శ్యామ్ సింగ రాయ్(Shyam singa roy) తరువాత వరుసగా ఫ్లాప్స్ తో సతమతం అవుతున్న నానీకి మంచి హిట్ దక్కింది. రిలీజ్ అయిన ఫస్ట్ రోజు నుంచే కలెక్షన్ల వర్షం కురిసింది.

తాజాగా ఈ సినిమాను చూసిన మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా గురించి ట్వీట్ చేశారు నానీతో పాటు మూవీ టీమ్ అందరిని అభినందించారు. సినిమాపై రివ్యూ ఇచ్చారు. నటీనటులపై ట్వీట్ చేశారు. మూవీ టీమ్ అభినందించారు మెగాస్టార్ చిరంజీవి సినిమా చాలా గొప్పగా ఉందంటూ ట్వీట్ చేశాడు. డియర్ నానీ.. దసరా చూశాను, అద్భుతంగా ఉంది. నాని పెర్ఫార్మన్స్ తో అదరగొట్టాడు. ఇది దర్శకుడు శ్రీకాంత్ మొదటి సినిమాని తెలిసి ఆశ్చర్యపోయాను. అతని నైపుణ్యాన్ని ఖచ్చితంగా అప్రిసియేట్‌ చేయాల్సింది. మహానటి కీర్తి సురేష్ జస్ట్ వావ్, దీక్షిత్ శెట్టి కూడా అద్భుతంగా నటించాడు. సంతోష్ నారాయణన్ సంగీతం వేరే లెవల్‌. దసరా టీమ్‌ మొత్తానికి అభినందనలు అంటూ ట్వీట్‌ చేశాడు.

ఫస్ట్ వీక్ లోనే బ్రేక్‌ ఈవెన్ పూర్తి చేసుకుని లాభాలతో దూసుకుపోతోంది దసరా సినిమా. రిలీజ్ అయిన 6 రోజులకే 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. మధ్యలో రావణాసుర లాంటి సినిమాలు వచ్చినా ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాయి. ఇక దసరా రిలీజ్ అయినప్పటి నుంచి సెలబ్రిటీల నుంచి కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. శ్రీకాంత్‌ టేకింగ్‌, నానీ పర్‌ఫార్మెన్స్‌కు స్టార్ హీరోలు కూడా ఫిదా అవుతున్నారు.

ఇప్పటికే వరుసగా సెలబ్రిటీల మన్ననలుఅందుకుంటున్న దసరాటీమ్.. ఇలా మెగాస్టార్‌ నుంచి కూడా విషెస్ రావడంతో సంతోషం పట్టలేకపోతున్నారు. ఇప్పటికీ దసరా చాలా సెంటర్స్ లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ కొనసాగిస్తుంది. అటుహిందీలో కూడా దసరా సినిమా ప్రభావం గట్టిగానే చూపించింది. నానితో పాటు.. కీర్తి సురేష్ కు మంచిపేరు వచ్చింది. వాళ్ల పెర్ఫామెన్స్ కు బాలీవుడ్ ఫిదా అయిపోయింది.

Updated On 14 April 2023 12:13 AM GMT
Ehatv

Ehatv

Next Story