✕
Chiranjeevi Pawan Kalyan Congratulates Sai Dharam Tej : విరూపాక్షకి మెగా అభినందనలు..
By EhatvPublished on 22 April 2023 2:22 AM GMT
యాక్సిడెంట్‌కి గురైన సుప్రీం హీరో సాయిధర్మ తేజకి చాలా కాలం గ్యాప్ తర్వాత సూపర్ హిట్ దొరికింది. ట్రీట్మెంట్ కారణంగా షూటింగ్ కార్యక్రమాలకి అంతరాయం కలుగుతున్నా, స్టడీగా షూటింగ్ బాధ్యతలను పూర్తి చేశాడు సుప్రీం. సినిమా కంప్లీట్ అయిన తర్వాత కూడా ప్రమోషన్లకు ఎంతో ఓపికగా, శ్రద్ధగా అటెండ్ అయి, మంచి బ్యాలెన్స్‌తో మీడియా ప్రశ్నలన్నిటికీ సరైన సమాధానాలు చెబుతూ ప్రతీ మీడియా మీట్‌ని రక్తికట్టించాడు.

x
సాయిధరమ్ తేజ్ కు వరుసగా సక్సెస్ విషెష్ తెలియజేస్తున్నారు సెలబ్రిటీలు. రామ్ చరణ్ కూడా కంగ్రాట్స్ బ్రదర్ అంటూ ట్వీట్ చేశారు. అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ కూడా సాయి ధరమ్ తేజ్ ను విష్ చేశారు. మరో వైపు కల్యాణ్ రామ్ కూడా సాయి తేజ్ నుఅభినందిస్తూ.. ట్వీట్ చేశారు. ఇలా సెలబ్రిటీస్ కూడా విరూపాక్ష మూవీపై ప్రసంసలు కురిపిస్తున్నారు.
-
- యాక్సిడెంట్‌కి గురైన సుప్రీం హీరో సాయిధర్మ తేజకి చాలా కాలం గ్యాప్ తర్వాత సూపర్ హిట్ దొరికింది. ట్రీట్మెంట్ కారణంగా షూటింగ్ కార్యక్రమాలకి అంతరాయం కలుగుతున్నా, స్టడీగా షూటింగ్ బాధ్యతలను పూర్తి చేశాడు సుప్రీం. సినిమా కంప్లీట్ అయిన తర్వాత కూడా ప్రమోషన్లకు ఎంతో ఓపికగా, శ్రద్ధగా అటెండ్ అయి, మంచి బ్యాలెన్స్‌తో మీడియా ప్రశ్నలన్నిటికీ సరైన సమాధానాలు చెబుతూ ప్రతీ మీడియా మీట్‌ని రక్తికట్టించాడు. ప్రమోషన్ల టైంలోనే ట్రైలర్, టీజర్ వంటివి విడుదలవుతూనే, విరూపాక్షకి తిరుగులేని టాక్ వచ్చేసింది. ఇది ఎప్పుడో, ఎక్కడో గానీ జరిగే పరిణామం కాదు. ట్రైలర్, టీజర్లు చాలా ఇంట్రస్టింగ్‌గా ఉండడంతో అందరినీ అవి అమితంగా ఆకట్టుకుని, విరూపాక్షకి స్ట్రాంగ్ టాక్ని తెచ్చిపెట్టాయి.
-
- చేతబడి, బ్లాక్ మేజిక్ కథలు అవుట్‌డేట్ అయినప్పటికీ, దర్శకుడు కార్తీక్ దండు కథను స్పెషల్ టెంపోతో ట్రీట్ చేసి మార్కులు కొట్టేశాడు. టెక్నీషియన్లు అందరూ వీరగా పనిచేయడంతో విరూపాక్ష చూడ్డానికి అదిరిపోయింది. టెన్షన్ పెట్టిపెట్టి మరీ ఎక్సైట్ చేసింది. మోర్నింగ్ షోలు కొంచెం లిమిటెడ్‌గా ఉన్నా, మోర్నింగ్ షో మౌత్ టాక్ అదిరింది అని రావడంతో మధ్యాహ్నం నుంచీ విరూపాక్ష కలెక్షన్లు దూసుకుపోయాయి. ఈవెనింగ్ షో, నైట్ షోలతో విరూపాక్ష పూర్తిగా భీబత్సం సృష్టించిందనే చెప్పాలి. ఎక్కడేస్తే అక్కడ చెలరేగిపోయింది ఓవర్ సీస్‌తో సహా. కథ, స్క్రీన్ నెరేషన్, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌ల సహకారం, కంట్రిబ్యూషన్లు అన్నీ కలగలిసి, దర్శకుడు కార్తిక్ దండుకి భుజం కాశారు. గ్రేట్ డైరెక్టర్ అనిపించుకున్న సుకుమార్ రైటింగ్స్ కాంబెనేషన్లో శ్రీ వేంకటేశ్వర సినీచిత్ర కంబైన్ అయి, సుకుమార్ స్క్రీన్‌ప్లే కూడా సమకూర్చడంతో విరూపాక్షకి తిరుగులేని రిటర్న్స్ రావడం పూర్తిగా సహజ పరిణామంగానే అయింది.
-
- ముఖ్యంగా చూస్తే మెగాస్టార్ చిరంజీవిలాటి లెజెండ్ విరూపాక్షను మెచ్చుకుంటూ ట్వీట్ చేయడం, మెగాస్టార్ సతీమణి శ్రీమతి సురేఖగారు సాయిధర్మతేజకి స్వీట్స్ తినిపించి, అభినందనలు తెలియజేయడంతో విరూపాక్షకు నడుస్తున్న టాక్ మరింత స్ప్రెడ్ అయింది. మెగా అభినందనలు తోడవడంతో విరూపాక్ష సక్సెస్‌కి సూపర్ రేంజ్ వచ్చినట్టయింది.

Ehatv
Next Story