తమిళనాట తెలుగు సినిమాలకు ఈ మధ్యే కాస్త డిమాండ్ పెరుగుతుంది. వాళ్ల హీరోలు కూడా మన తెలుగుసినమాలు చేయడానికి ఉరుకులుపెడుతున్నారు. ఈక్రమంలో మన హీరోల సినిమాలు కూడా చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు తమిళులు

తమిళనాట తెలుగు సినిమాలకు ఈ మధ్యే కాస్త డిమాండ్ పెరుగుతుంది. వాళ్ల హీరోలు కూడా మన తెలుగుసినమాలు చేయడానికి ఉరుకులుపెడుతున్నారు. ఈక్రమంలో మన హీరోల సినిమాలు కూడా చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు తమిళులు

తాజాగా టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) హీరోగా మాస్ మహారాజ ఒక ముఖ్య పాత్రలో దర్శకుడు కె ఎస్ రవీంద్ర తెరకెక్కించిన సెన్సేషనల్ హిట్ మూవీ వాల్తేరు వీరయ్య(Waltair Veerayya). మరి ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చి భారీ వసూళ్లు అందుకున్న ఈ చిత్రం రీసెంట్ గానే తెలుగులో స్మాల్ స్క్రీన్ ఎంట్రీ కూడా ఇచ్చింది. అయితే ఈ మూవీ త్వరలో తమిళ వర్షన్. టెలివిజన్ లో ప్రసారం కాబోతోంది.

అయితే ఈ చిత్రం ఇప్పుడు తమిళ్ వెర్షన్ లో కూడా వరల్డ్ ప్రీమియర్ గా టెలికాస్ట్ అయ్యేందుకు సిద్ధం కాగా రేపు అక్టోబర్ 29న మధ్యాహ్నం 3 గంటలకి అయితే ఈ సినిమా విజయ్ టెలివిజన్ ఛానెల్లో ప్రసారం కానుంది. మరి దీనికంటే ముందు..తమిళ నాట బుల్లితెర మీద మెగాస్టార్ గత పాన్ ఇండియా సినిమా సైరా నరసింహా రెడ్డి(Syra Narsimha Reddy) కి భారీ రికార్డు ఉంది. మరి ఆ రికార్డ్ ను ఇది బ్రేక్ చేస్తుందా అనేది చూడాలి.

సైరాకి తమిళనాట దాదాపు 15.44 టీఆర్పీ రేటింగ్ నమోదు కాగా టాలీవుడ్ సినమాల్లో ఇంత భారీదా సాధించినది ఇదే. అయితే ఇదొక భారీ రికార్డుగా ఉంది. మరి ఇప్పుడు వీరయ్య దీనిని బ్రేక్ చేస్తాడో లేదో అనేది చూడాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

Updated On 28 Oct 2023 8:11 AM GMT
Ehatv

Ehatv

Next Story