మెగాస్టార్ చిరంజీవి(Mega Star Chiranjeevi) హీరోగా నటించిన సినిమా ‘భోళా శంకర్’(Bhola Shankar)ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది. థియేటర్ల వద్ద అభిమానులు సందడి చేస్తున్నారు. ఈ సినిమాలో తమన్నా(Tamannaah) కథానాయికగా నటించింది. కీర్తి సురేష్(Keerthy Suresh) ఆయన చెల్లెలు పాత్రలో కనిపించింది. మెహర్ రమేష్(Mehar Ramesh) దర్శకత్వం వహించారు.

Chiranjeevi Kushi Scene With Sreemukhi
మెగాస్టార్ చిరంజీవి(Mega Star Chiranjeevi) హీరోగా నటించిన సినిమా ‘భోళా శంకర్’(Bhola Shankar)ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది. థియేటర్ల వద్ద అభిమానులు సందడి చేస్తున్నారు. ఈ సినిమాలో తమన్నా(Tamannaah) కథానాయికగా నటించింది. కీర్తి సురేష్(Keerthy Suresh) ఆయన చెల్లెలు పాత్రలో కనిపించింది. మెహర్ రమేష్(Mehar Ramesh) దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో బుల్లితెర నటుడు గెటప్ శ్రీను, యాంకర్ శ్రీముఖి నటించారు. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కలకత్తా బ్యాక్ డ్రాప్‌లో సినిమా అంటే మెగాస్టార్‌కి హిట్ పక్కా అనే సెంటిమెంట్ ఉంది. ‘భోళా శంకర్’ కూడా కలకత్తా బ్యాక్ డ్రాప్ మూవీ కావడంతో అభిమానులు హిట్ పక్కా అంటున్నారు.
అయితే సినిమా నుంచి ఓ సీన్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఆ సీన్ పవన్ నటించిన ఖుషీ సీన్(Kushi Seen)ను పోలి ఉండటంతో తెగ వైరల్ అవుతుంది. ఖుషీలో పవన్, భూమికల నడుము సీన్ కు ధియేటర్లలో ఓ రేంజ్‌లో విజిల్స్ పడ్డాయి. ఇప్పుడు ఆ సీన్‌ను యాంకర్ శ్రీముఖి(Sreemukhi), చిరంజీవి(Chiranjeevi)ల మధ్య తెరకెక్కించారు దర్శకుడు మెహర్ రమేష్. శ్రీముఖి సోఫాలో కూర్చుని బుక్ చదువుతుంటే.. చిరంజీవి ఆమె నడుమును చూస్తాడు. చూసి తట్టుకోలేక పక్కనే ఉన్న గ్లాస్‌లో ఉన్న నీళ్లు తాగుతాడు. ఆ సమయంలో చిరంజీవి ఎక్స్‌ప్రెషన్స్‌కు థియేటర్లో అభిమానులు అరుపులు పెట్టారు. అయితే.. ఈ సీన్‌పై నెట్టింట భిన్నంగా స్పందిస్తున్నారు, చిరంజీవి ఈ వయసులో ఇటువంటివి చేయవలసిన అవసరం ఉందా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొందరు ఎంటర్‌టైన్ మెంట్ యాంగిల్ తీసింది.. ఆ యాంగిల్‌లోనే చూడాలని అంటున్నారు. మొత్తానికి పవన్, శ్రీముఖిల సీన్ మాత్రం అదిరింది.
