ఒక్కో హీరోను ఒక్కో సినిమా ఓవర్‌నైట్ స్టార్‌ను చేస్తుంది. ఎన్టీఆర్‌కు పాతాళభైరవి ఎలాగో, అమితాబ్‌బచ్చన్‌కు జంజీర్ ఎలాగో చిరంజీవికి(Chiranjeevi) ఖైదీ(Khaidhi) అలాగన్నమాట! చిరంజీవి సినీ కెరీర్‌ను పీక్‌లోకి తీసుకెళ్లిన సినిమా ఇది! అందుకే ఆయన పదే పదే ఖైదీ గురించి చెప్పుకుంటుంటారు.
ఒక్కో హీరోను ఒక్కో సినిమా ఓవర్‌నైట్ స్టార్‌ను చేస్తుంది. ఎన్టీఆర్‌కు పాతాళభైరవి ఎలాగో, అమితాబ్‌బచ్చన్‌కు జంజీర్ ఎలాగో చిరంజీవికి(Chiranjeevi) ఖైదీ(Khaidhi) అలాగన్నమాట! చిరంజీవి సినీ కెరీర్‌ను పీక్‌లోకి తీసుకెళ్లిన సినిమా ఇది! అందుకే ఆయన పదే పదే ఖైదీ గురించి చెప్పుకుంటుంటారు. ఖైదీ పేరు మీద ఉన్న ఇష్టం కొద్దే ఆయన ఖైదీ నంబర్ 786, ఖైదీ నంబర్ 150 సినిమాలు చేశారు. అప్పట్లో వచ్చిన ఈ కల్ట్ క్లాసిక్ సినిమా చిరంజీవిని స్టార్ హీరోగా మలచింది. అప్పటి వరకు వచ్చిన కమర్షియల్ సినిమాల ఫార్మెట్ పూర్తిగా మార్చేసింది. కమర్షియల్ సినిమాలకు కొత్త లెక్కలు నేర్పింది.
వసూళ్లలో కొత్త బాటలు వేసింది. ఈ సినిమా సరిగ్గా 40 ఏళ్ల కిందట అంటే 1983, అక్టోబర్ 28న విడుదలయ్యింది. ఎ.కోదండరామిరెడ్డి(A. Kodandarami Reddy) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మాధవి(Madhavi), సుమలతలు(Sumalatha) హీరోయిన్లుగా నటించారు. ఖైదీ చిత్రం 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చిరంజీవి ట్వీట్ చేశారు.'ఖైదీ' చిత్రం నిజంగానే అభిమానుల గుండెల్లో నన్ను శాశ్వత 'ఖైదీ’ని చేసింది. నా జీవితంలో ఓ గొప్ప టర్నింగ్ పాయింట్ ఆ చిత్రం. ఆ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించిన తీరు ఎప్పటికీ మరువలేను.
ఖైదీ విడుదలై నేటికి 40 సంవత్సరాలైన సందర్భంగా ఆ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆ చిత్ర దర్శకులు ఎ.కోదండరామిరెడ్డిగారిని నిర్మాతలు సంయుక్తా మూవీస్ టీమ్‌ని, నా కోస్టార్స్ సుమలత, మాధవి మొత్తం టీమ్‌ను అభినందిస్తూ, అంత గొప్ప విజయాన్ని మాకు అందించిన తెలుగు ప్రేక్షకులు అందరికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను’’ అని ట్వీట్‌లో చిరంజీవి పేర్కొన్నారు.
నిజానికి ఈ సినిమాను సూపర్‌స్టార్ కృష్ణ(Krishna) చేయాలి.
కానీ కాల్షీట్లు కుదరకపోవడం వల్ల సినిమా చేయలేకపోయారు. దాంతో ఆ అవకాశం చిరంజీవికి దక్కింది. ఇక ఈ సినిమాకు దర్శకత్వం వహించాల్సిన కె.రాఘవేంద్రరావు కూడా కొన్ని కారణాల వల్ల తప్పుకున్నారు. దాంతో కోదండరామిరెడ్డి డైరెక్ట్ చేయాల్సి వచ్చింది.
1982లో సిల్వస్టర్ స్టాలిన్ హీరోగా వచ్చిన అమెరికన్ మూవీ ఫస్ట్ బ్లడ్ ప్రేరణగా ఈ సినిమాను రూపొందించారు.ఆశ్చర్యమేమిటంటే షూటింగ్ మొదలైన కొన్ని రోజుల వరకు చిరు కథ వినలేదట!పరచూరి బ్రదర్స్ మీద అంత కాన్ఫిడెన్స్ అన్నమాట!
ఈ సినిమాకు చక్రవర్తి సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ చిత్రంలో నటించినందుకు చిరంజీవికి 1,75,000 రూపాయలు పారితోషికంగా ఇచ్చారు. కోదండరామిరెడ్డి 40 వేలు పుచ్చుకున్నారు. వంద రోజుల వేడుకకు హీరో కృష్ణ ముఖ్య అతిథిగా వచ్చారు. ఖైదీ 1983 సంవత్సరానికి అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఆ రోజుల్లో ఈ సినిమాకు 3.2 కోట్ల టికెట్లు తెగాయి. ఇది ఆ టైమ్‌లో పెద్ద రికార్డుగా చెబుతారు. ఈ సినిమా 20 కేంద్రాల్లో 100 రోజులు, అయిదు కేంద్రాల్లో 200 రోజులు, రెండు కేంద్రాల్లో 365 రోజులు ఆడింది.
'ఖైదీ' చిత్రం నిజంగానే అభిమానుల గుండెల్లో నన్ను శాశ్వత 'ఖైదీ'ని చేసింది.
నా జీవితంలో ఓ గొప్ప టర్నింగ్ పాయింట్ ఆ చిత్రం ! ఆ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించిన తీరు ఎప్పటికీ మరువలేనిది.
ఖైదీ విడుదలై నేటికి 40 సంవత్సరాలయిన సందర్భంగా ఒక సారి
ఆ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ,
ఆ చిత్ర… pic.twitter.com/raY4AOTAoH— Chiranjeevi Konidela (@KChiruTweets) October 28, 2023