Chiranjeevi : చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి చిరంజీవి!
ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) కూటమి ప్రభుత్వం ఏర్పడబోతున్నది. ఈ ప్రభుత్వానికి మెగాస్టార్ చిరంజీవి కూడా మద్దతు ప్రకటించారు. జనసేన పార్టీకి సంబంధించిన నాయకులకు ఓట్లు వేయండి అని చిరంజీవి పిలుపునిచ్చినప్పుడే చిరంజీవి స్టాండ్ ఏమిటో అర్థమయ్యింది. తమ్ముడు పవన్ కల్యాణ్(Pawan kalyan) విజయాన్ని కూడా చిరంజీవి(Chiranjeevi) కాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) కూటమి ప్రభుత్వం ఏర్పడబోతున్నది. ఈ ప్రభుత్వానికి మెగాస్టార్ చిరంజీవి కూడా మద్దతు ప్రకటించారు. జనసేన పార్టీకి సంబంధించిన నాయకులకు ఓట్లు వేయండి అని చిరంజీవి పిలుపునిచ్చినప్పుడే చిరంజీవి స్టాండ్ ఏమిటో అర్థమయ్యింది. తమ్ముడు పవన్ కల్యాణ్(Pawan kalyan) విజయాన్ని కూడా చిరంజీవి(Chiranjeevi) కాంక్షించారు. కాబట్టి చిరంజీవి కూటమికి మద్దతు ఇచ్చినట్టుగానే చూడాలి. జగన్మోహన్‌రెడ్డి(Jagan Mohan Reddy) ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిరంజీవిని అవమానించారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. జగన్మోహన్‌రెడ్డితో చిరంజీవి సమావేశం అయిన సందర్భంగా కొన్ని విజువల్స్ బయటకు వచ్చాయి. అందులో జగన్‌కు చిరంజీవి నమస్కారం పెడుతుంటే జగన్ ప్రతి నమస్కారం పెట్టకుండా నవ్వుతూ ఉన్న ఫోటో సంచలనం సృష్టించింది. ఈ ఫోటోను జనసేన(Janasena) పార్టీ వైరల్ చేస్తూ వచ్చింది. హీరోలు వచ్చే కార్లను ఇంటి బయటే ఆపించి వారిని నడిపించుకుని ఇంటికి తీసుకెళ్లినట్టు ప్రచారం చేశారు. లోపలికి వెళ్లిన తర్వాత వారిని బానిసల్లాగా ట్రీట్ చేశారంటూ సినీ ఇండస్ట్రీలోని కొందరు సన్నిహితుల దగ్గర చెప్పుకున్నారు. ఇప్పడు కూటమి ఏపీలో అధికారంలోకి వచ్చింది. చిరంజీవి సహజంగానే కూటమికి మద్దతు పలికారు. బుధవారం ఉదయం జరిగే చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చిరంజీవిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆయనను స్టేట్‌గెస్ట్‌గా వేడుకకు పిలుస్తున్నారు. ఈ రోజు సాయంత్రం చిరంజీవి ప్రత్యేక విమానంలో విజయవాడకు వెళుతున్నారు.