రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్(cancer screening) శిబిరాలను నిర్వహించనున్నట్టు మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) ఓ ప్రకటనలో వెల్లడించారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్(Chiranjeevi Charitable Trust), స్టార్ హాస్పిటల్ సంయుక్తంగా ఈ ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

Free Cancer Screening
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్(cancer screening) శిబిరాలను నిర్వహించనున్నట్టు మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) ఓ ప్రకటనలో వెల్లడించారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్(Chiranjeevi Charitable Trust), స్టార్ హాస్పిటల్ సంయుక్తంగా ఈ ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తొలివిడతగా జూలై 9న జూబ్లీహిల్స్‌లోని(Jubliee Hills) చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ క్యాంపస్‌లో ముందస్తు ఓరల్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయనున్నట్టు ప్రకటనలో తెలిపారు. ఇందులో జర్నలిస్టులకు పరీక్షలు చేస్తారని వివరించారు. ఈ ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమంలో పాల్గొని తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకునే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టాలని ఆకాంక్షించారు.
బ్రెస్ట్, సర్వైకల్, లంగ్, పెద్దపేగు తదితర క్యాన్సర్లన్నింటికీ ప్రత్యేక క్యాంప్‌ల ద్వారా పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. నాలుగు నెలల ప్రణాళికలో భాగంగా తొలి విడతగా హైదరాబాద్, కరీంనగర్, వైజాగ్‌లో స్క్రీనింగ్ శిబిరాలు నిర్వహిస్తామని వివరించారు. ప్రతి క్యాంప్‌లో వెయ్యి మందికి తగ్గకుండా పరీక్షలు చేస్తామని, అయితే హైరిస్క్ గ్రూప్‌ను గుర్తించి వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు తెలిపారు.
