మెగాస్టార్ చిరంజీవి(Mega Star chiranjeevi) కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ.. వరుస సినిమాలు చేస్తున్నారు. గెలుపోటములు పట్టించుకోకుండా చిరంజీవవి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఈక్రమంలో ఆయన ఎక్కువగా రీమేక్ కథల(Remake Stories)పై దృష్టి పెట్టారు. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ డైరెక్షన్... లో తెరకెక్కుతున్న ఈసినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలి పాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈసినిమా..

Chiranjeevi Focus On Remake Movies
మెగాస్టార్ చిరంజీవి(Mega Star chiranjeevi) కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ.. వరుస సినిమాలు చేస్తున్నారు. గెలుపోటములు పట్టించుకోకుండా చిరంజీవవి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఈక్రమంలో ఆయన ఎక్కువగా రీమేక్ కథల(Remake Stories)పై దృష్టి పెట్టారు.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్(Meher Ramesh) డైరెక్షన్... లో తెరకెక్కుతున్న ఈసినిమాలో తమన్నా(Tamanna )హీరోయిన్ గా నటిస్తోంది. కీర్తి సురేష్(Keerthy Suresh) చిరంజీవి చెల్లెలి పాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈసినిమా..ఈ ఏడాది అగస్ట్ 11న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈసినిమాపై మెగా ఫ్యాన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఈసినమా తరువాత చిరంజీవి ఏ సినిమా చేయబోతున్నారు.. వెంకీ కుడుముల(Venky Kudumula)తో అనౌన్స్ చేసిన సినిమా సెట్స్ ఎక్కేలా కనిపించడంలేదు. అది కాన్సిల్ అయినట్టే అని టాక్ వినిపిస్తుంది.
సీనియర్ డైరెక్టర్(Senior Director) తో.. మరో రీమేక్ ను తెరపైకి తీసుకురావాలి అని చూస్తున్నారట మెగాస్టార్. చిరుకు రీమేక్ కథలు బాగా కలిసి వచ్చినట్టున్నాయి. దాంతో ఎక్కువగా తమిళ, మలయాళ కథలపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈక్రమంలో చిరంజీవి ఏయే దర్శకులతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో తెరపైకి వీవీ వినాయక్ - కృష్ణవంశీ పేర్లు వచ్చాయి.
ఎలాగు రీమేక్ కథ చేయాలి అనుకుంటున్నాడు కాబట్టి.. 2019లో అజిత్ హీరోగా వచ్చిన విశ్వాసం సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని చూస్తున్నాడట చిరు. ఈమూవీ తమిళం(Tamil)లో భారీ విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వర్షన్ కూడా బాగా ఆడింది. మరి ఇది టాలీవుడ్ లో ఎంత వరకూ వర్కౌట్ అవుతుందో తెలియదు. ఈ సినిమాను వినాయక్ దర్శకత్వంలో రీమేక్ చేయాలనే ఆలోచనలో చిరంజీవి ఉన్నారు.
దీనితో పాటు మలయాళంలో ఏడాది క్రితం మలయాళం(Malayalam)లో వచ్చిన మమ్ముట్టి(Mammootty )మూవీ 'భీష్మ పర్వం(Bheeshma Parvam) కూడా మెగాస్టార్ ఆలోచనల్లో ఉన్నట్టు తెలుస్తోంది. అక్కడ సంచలన విజయాన్ని నమోదు చేసిన ఈసినిమా కథలో మార్పులు చేసి.. ఇక్కడ రీమేక్ చేయాలని మెగా ప్లాన్. అంతే కాదు ఇప్పటికే ఈ సినిమా రీమేక్ హక్కులను కూడా చరణ్ దక్కించుకున్నట్టు సమాచారం.
ఈ రీమేక్ ను కూడా వినాయక్ యితే బాగ్ హ్యాండిల్ చేస్తాడని మెగాస్టార్ భావిస్తున్నారట. దాంతో ఈ రెండు రీమేకులలో ముందుగా ఏది సెట్స్ పైకి వెళుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక గతంలోనే చిరంజీవికి కృష్ణవంశీ 'వందేమాతరం' అనే కథను వినిపించి ఉన్నాడు. అయితే చిరంజీవికి అప్పుడున్న కమిట్మెంట్స్ వలన ఆ కథను చేయడం కుదరలేదు. తాజాగా మరోసారి కథను విన్న చిరంజీవి కొన్ని మార్పులు .. చేర్పులు చెప్పినట్టుగా తెలుస్తోంది.
వీరు కాకుండా వెంకీ కుడుములపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు మెగాస్టార్.. అటు బింబిసార' డైరెక్టర్ మల్లిడి వశిష్ఠ(Mallidi Vasishta) కూడా చిరంజీవితో సినిమా చేయడానికి గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడని టాక్. మరి మెగా మనసులో ఎం ఉంది..? నెక్ట్స్ ప్లానింగ్ ఏంటీ అనేది చూడాలి.
