మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi) తాజా చిత్రం భోళాశంకర్‌(Bholashankar) ఆల్‌మోస్టాల్‌ కంప్లీట్‌ అయ్యింది. జూలై 27న సినిమా ట్రైలర్‌ కూడా రిలీజ్‌కాబోతున్నది. వచ్చే నెల 11 న సినిమా థియేటర్లలో రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు ప్రేక్షకులను అమితంగా అలరిస్తున్నాయి. అయితే ఇటీవల షూటింగ్‌ పూర్తయిన తర్వాత చిరంజీవి తన భార్య సురేఖతో(Surekha) కలిసి అమెరికా(America) వెళ్లారు. అయితే అది విహారయాత్ర అనుకున్నారంతా! అయితే చిరంజీవి మెడికల్‌ పనిమీద వెళ్లినట్టు సమాచారం.

మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi) తాజా చిత్రం భోళాశంకర్‌(Bholashankar) ఆల్‌మోస్టాల్‌ కంప్లీట్‌ అయ్యింది. జూలై 27న సినిమా ట్రైలర్‌ కూడా రిలీజ్‌కాబోతున్నది. వచ్చే నెల 11 న సినిమా థియేటర్లలో రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు ప్రేక్షకులను అమితంగా అలరిస్తున్నాయి. అయితే ఇటీవల షూటింగ్‌ పూర్తయిన తర్వాత చిరంజీవి తన భార్య సురేఖతో(Surekha) కలిసి అమెరికా(America) వెళ్లారు. అయితే అది విహారయాత్ర అనుకున్నారంతా! అయితే చిరంజీవి మెడికల్‌ పనిమీద వెళ్లినట్టు సమాచారం. భోళా శంకర్‌ సినిమాను చిరంజీవి పూర్తి చేసినప్పటికీ గత కొన్నాళ్ల నుంచి ఆయన కాలి నొప్పితో బాధపడుతున్నారట! ఈ క్రమంలోనే అమెరికా పర్యటన ప్లాన్‌ చేశారు. రిలీఫ్‌తో పాటు చిన్నపాటి సర్జరీ(Surgery) పూర్తి చేసుకుని చిరు వచ్చారట! ఈ విషయాన్ని మొదట రహస్యంగా ఉంచినప్పటికీ ఇప్పడు కాస్త ఆలస్యంగా ఈ విషయం బయటకు వచ్చింది. అసలు చిరంజీవికి వచ్చిన సమస్య ఏమిటి? సర్జరీ చేయాల్సినంతగా గాయం అయ్యిందా? వంటి విషయాలు మాత్రం తెలియదు. కానీ సమస్య మాత్రం ఏమంత పెద్దది కాదని, కంగారు పడాల్సిన అవసరం లేదని చిరంజీవి సన్నిహితులు చెబుతున్నారు. అమెరికా నుంచి తిరిగి హైదరాబాద్‌కు వచ్చిన చిరంజీవి విమానాశ్రయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా నడుచుకుంటూ వెళ్లారు. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సన్నిహితులు అంటున్నారు. వాల్తేర్‌ వీరయ్య(Walther Veeraya) సక్సెస్‌ తర్వాత చిరంజీవిలో సరికొత్త ఉత్సాహం వచ్చింది. వరుస సినిమాలతో అభిమానులను అలరిస్తున్నారు. లేటెస్ట్‌ సినిమా భోళాశంకర్‌ ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడు చిరంజీవి సినిమా ప్రమోషన్లకు హాజరుకాబోతున్నారు. అలాగే కూతురు సుస్మిత నిర్మాతగా వ్యవహరిస్తున్న కొత్త సినిమాను కూడా చిరంజీవి మొదలుపెట్టబోతున్నారు. ఇందులో మెగాస్టార్‌ చిరంజీవి సరసన త్రిష నటించబోతున్నారు. ఇందులో సిద్ధు, శ్రీలీల కూడా నటించబోతున్నారని అంటున్నారు. అయితే ఇది మలయాళ సినిమా 'బ్రో డాడీ'కి రీమేక్ అని అంటున్నారు. మలయాళంలో మోహన్‌లాల్‌, పృథ్వీరాజ్‌ నటించారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Updated On 26 July 2023 12:29 AM GMT
Ehatv

Ehatv

Next Story