ఏఎన్నార్‌ను(ANR) గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi). సోష‌ల్ మీడియాలో అక్కినేనిని గుర్తు చేసుకన్న చిరంజీవి అక్కినేని నటన గురించి పోస్టు పెట్టాడు.

ఏఎన్నార్‌ను(ANR) గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi). సోష‌ల్ మీడియాలో అక్కినేనిని గుర్తు చేసుకన్న చిరంజీవి అక్కినేని నటన గురించి పోస్టు పెట్టాడు.

అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా టాలీవుడ్ నుంచి ప్రముఖులు ఆయన్ను గుర్తు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆప్యాయంగా, గౌరవపూర్వకంగా ఆ మహానటుడికి నివాళులర్పిస్తున్నాను. ఆయన తెలుగు సినిమాకే కాదు భారతీయ సినీ చరిత్రలోనే ఓ దిగ్గజ నటుడు. ఆయన నటించిన వందలాది చిత్రాల ద్వారా ఆయన నటనా పటిమ, తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది. తెలుగు సినిమా బ్రతికినంత వరకు అక్కినేని నాగేశ్వరరావు గారు తెలుగు ప్రేక్షకుల మనస్సుల్లో ఎప్పటికీ నిలిచి వుంటారు.

ఆ మహానుభావుడి శతజయంతి సందర్భంగా అక్కినేని కుటుంబంలోని ప్రతి ఒక్కరికి ,నాసోదరుడు నాగార్జునకు(Nagarjuna) నాగేశ్వర రావు(Nageswar Rao) గారి కోట్లాది అభిమానులకు, సినీ ప్రేమికులందరికీ నా హృదయ పూర్వక శుభాకాంక్షలు అని చిరంజీవి ఎక్స్‌లో రాసుకోచ్చాడు. ఈ పోస్ట్‌కు #ANRLiveson అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించారు. కాగా ప్ర‌స్తుతం ఈ పోస్టు వైర‌ల్ అవుతుందిహైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఏఎన్నార్‌ శతజయంతి ఉత్సవాలు ఘ‌నంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో భాగంగా అక్కినేని విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రముఖులంతా ఏ ఎన్నార్ శతజయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Updated On 20 Sep 2023 6:05 AM GMT
Ehatv

Ehatv

Next Story