సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi) ఎందరికో స్ఫూర్తి.

సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi) ఎందరికో స్ఫూర్తి. నటుడుగా ఎదగాలనుకున్నవారు మొదటగా చిరంజీవిని ఇన్స్పిరేషన్‌గా తీసుకుంటారు. నటన(Acting), డ్యాన్స్‌లో(Dance) ప్రయోగాలకు చిరంజీవి పెట్టింది పేరు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకున్నా కానీ అంచెలంచెలుగా ఎదుగుతూ ఎన్నో మైలు రాళ్లను అధిరోహించారు. సాధారణ నటుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టి మహోన్నత శిఖరానికి చేరుకున్నారు. తొలుత చిన్నచిన్న పాత్రలతో వేసుకుంటూ వచ్చినా.. ఆ తర్వాత విలన్‌ పాత్రలో నటించినా.. ఆ తర్వాత హీరోగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి ఇప్పటికీ తెలుగు సినిమా ఇండస్ట్రీని ఊపేస్తున్నారు. ఆయన స్ఫూర్తితోనే పవర్ స్టార్‌ పవన్ కల్యాణ్(Pawan kalyan) సినీరంగంలోకి ఎదిగి ఎంత క్రేజ్‌ సంపాదించుకున్నారో మనకు తెలియనిది కాదు. ఇంత ఎదిగినా చిరంజీవి తన మూలాలను మర్చిపోలేదు. తాము ఎక్కడి నుంచి వచ్చామో.. ఎలా ఇంత ఎత్తుకు ఎదిగామో చెప్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తుంటారు. తాజాగా చిరంజీవి సోషల్‌ మీడియాలో(Social media) ఓ పోస్ట్‌ చేశారు. తాను డిగ్రీ రెండో ఏడాది చదువుతుండగా ఓ నాటకం వేసి అందులో ఉత్తమ నటుడిగా(Best actor) అవార్డు కూడా తీసుకున్నారు. 1974లో తీసుకున్న ఈ ఫొటోను చిరంజీవి షేర్‌ చేశారు. డిగ్రీ రెండో సంవత్సరం చదువుతుండగా 'రాజీనామా' అనే నాటకంలో చిరంజీవి నటనకుగాను ఆయనకు బెస్ట్‌ యాక్టర్‌ ఆఫ్ కాలేజ్‌గా అవార్డు వచ్చింది. 50 ఏళ్ల ప్రస్థానం అంటూ ఆ విషయాన్ని ఆయన గుర్తు చేసుకుంటూ ఫొటోను పోస్ట్‌ చేశారు. ఆయన పోస్ట్ చేసిన క్షణాల్లోనే ఇది వైరల్‌గా మారింది.



Eha Tv

Eha Tv

Next Story