భోళాశంకర్(Bholashankar) సినిమా ఇచ్చిన అనుభవంతో చిరంజీవి ఇప్పుడు సినిమా ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి బింబిసార దర్శకుడు వశిష్ట(Vasista) రూపొందిస్తున్న సినిమాపైనే ఎక్కువ దృష్టి పెట్టారు చిరంజీవి. ఫాంటసీ జానర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం పూజా కార్యక్రమం లేటెస్ట్‌గా జరిగింది.
భోళాశంకర్(Bholashankar) సినిమా ఇచ్చిన అనుభవంతో చిరంజీవి ఇప్పుడు సినిమా ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి బింబిసార దర్శకుడు వశిష్ట(Vasista) రూపొందిస్తున్న సినిమాపైనే ఎక్కువ దృష్టి పెట్టారు చిరంజీవి. ఫాంటసీ జానర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం పూజా కార్యక్రమం లేటెస్ట్‌గా జరిగింది.
ప్రస్తుతానికి ఈ సినిమా మెగా 156(Mega 156) అనే టైటిల్‌తో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫొటోలు, వార్తలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. నటీనటుల ఎంపికకు సంబంధించి కసరత్తు జరుగుతోంది. సినిమా షూటింగ్ మొదలైన సందర్భంగా ఈ సినిమా టైటిల్ అప్‌డేట్స్ గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి విశ్వంభర(Vishwambhara) అనే సరికొత్త టైటిల్‌ను మేకర్స్ దాదాపుగా ఖరారు చేశారట! ఈ సినిమా మొత్తం మూడు లోకాల చుట్టూ తిరిగే కథ అని అంటున్నారు.
దేవ, మానవ, పాతాళ లోకాల్లో ఓ పాప చుట్టూ తిరిగే ఫాంటసీ కథ అని టాక్ వినిపిస్తోంది. ఇందులో ప్రతినాయకుడిగా దగ్గుబాటి రానా(Daggubati Rana) నటిస్తున్నాడు. అనుష్క షెట్టి(Anushka Shetty), మృణాల్ ఠాకూర్‌లలో(Mrunal thakur) ఎవరో ఒకరు కథానాయిక పాత్ర పోషిస్తారు. ఈ సినిమాకు సంబంధించి ఓ పాటను కూడా సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి(MM Keeravani) రికార్డింగ్ చేశారట! 2025 సంక్రాంతి బరిలో సినిమాను దింపాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట.
తెలుగులో సోషియో ఫాంటసీ సినిమాలు చాలా ఉన్నాయి. చిరంజీవికి మాత్రం జగదేకవీరుడు అతిలోకసుందరి మాత్రమే ఉంది. అప్పట్లో ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. చిరంజీవి- వశిష్ట మూవీ కూడా సోషియో ఫాంటసీనే అనే వార్త రాగానే వైజయంతీ మూవీస్(Vyjayanthi Movies) సంస్థ అలెర్టయ్యింది. తమ కథ, సినిమా, టైటిల్ ఇలా దేన్నైనా సరే వారి అనుమతి లేకుండా వాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ట్వీట్ చేసింది. మొదట ముల్లోకాల వీరుడు అనే టైటిల్ పెట్టాలనుకున్న మేకర్స్ ఎందుకైనా మంచిదని ఇప్పుడు విశ్వంభర అనే సరికొత్త టైటిల్‌ను అనుకుంటున్నారు.