మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi) నటిస్తున్న తాజా చిత్రం భోళాశంకర్‌(Bholashankar). దీనికి మెహర్‌ రమేశ్‌(Mehar Ramesh) దర్శకత్వం వహిస్తున్నాడు. సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. లేటెస్ట్‌గా మిల్కీ బ్యూటీ నువ్వే నా స్వీటీ. అరె నీకు నాకు డేటింగ్‌ పార్టీ అనే పాటను రిలీజ్‌ చేశారు.

మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi) నటిస్తున్న తాజా చిత్రం భోళాశంకర్‌(Bholashankar). దీనికి మెహర్‌ రమేశ్‌(Mehar Ramesh) దర్శకత్వం వహిస్తున్నాడు. సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. లేటెస్ట్‌గా మిల్కీ బ్యూటీ నువ్వే నా స్వీటీ. అరె నీకు నాకు డేటింగ్‌ పార్టీ అనే పాటను రిలీజ్‌ చేశారు. తమన్నా గురించి చిరంజీవి ఈ మాటంటుంటే, తమన్నానేమో(tamannaah) అచ్చ తెలుగు మిర్చి మగాడు వీడే, బొంబాటు ఘాటు హాటు హాటుగున్నాడే..

కల్లోకి వచ్చేసి కన్నె గుండెల్లో సూది గుచ్చి పిల్లా నీ ముచ్చటేంది అన్నాడే అంటూ బదులిచ్చారు ఈ పాటలో! రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటను విజయ్‌ ప్రకాష్, సంజన కల్మంజేతో కలసి ఈ చిత్ర సంగీతదర్శకుడు మహతి స్వర సాగర్‌ ఆలపించారు. శేఖర్‌ మాస్టర్‌ డాన్స్‌ కంపోజ్‌ చేశారు. ఈ పాటలో చిరంజీవి, తమన్నా కెమెస్ట్రీ చూడముచ్చటగా చూపించారు మెహర్‌ రమేశ్‌. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో చిరంజీవి మాస్‌ స్టయిలీష్‌ లుక్‌లో కనిపించబోతున్నారు. కీర్తి సురేశ్‌, సుశాంత్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Updated On 22 July 2023 12:21 AM GMT
Ehatv

Ehatv

Next Story