✕
Chiranjeevi Kind Nature : అదీ మెగాస్టార్ అంటే... అయన స్థానం వేరే..!
By EhatvPublished on 28 April 2023 12:50 AM
ఊరికే పేర్లు సార్ధకం కావు. సినిమా హిట్లు, రికార్డులు, సంచలనాలు ఒకెత్తు ఇవి ట్రేడ్కీ, ఫ్యాన్స్ కోసం నిర్దేశించిన పండగలు. కానీ, వాటికి వ్యక్తిత్వం కూడా తోడైతే బంగారానికి తావి అబ్బినట్టే. ఈ నిజం మెగాస్టార్ చిరంజీవి సందర్భంలో వేనవేలు సార్లు నిరూపితిమైంది.

x
chiranjeevi
-
- ఊరికే పేర్లు సార్ధకం కావు. సినిమా హిట్లు, రికార్డులు, సంచలనాలు ఒకెత్తు ఇవి ట్రేడ్కీ, ఫ్యాన్స్ కోసం నిర్దేశించిన పండగలు. కానీ, వాటికి వ్యక్తిత్వం కూడా తోడైతే బంగారానికి తావి అబ్బినట్టే. ఈ నిజం మెగాస్టార్ చిరంజీవి సందర్భంలో వేనవేలు సార్లు నిరూపితిమైంది. సినిమా పరిశ్రమని ఎంతో ప్రేమించి, అందరూ తనవాళ్ళే అనుకునే ఆయన నైజం, లక్షణం అయన్ని ఎప్పుడూ ఎత్తుగానే నిలబెడుతోంది. ఆయన ద్వారా సమాజానికి జరిగే సేవలు లెక్కకు మించే ఉంటాయి లెక్కబెడితే. అడుగడుగునా ఆయనను అభిమానించే వారందరికీ అవన్నీ ఎప్పటికీ చెరిగిపోని, చరిత్ర మరచిపోని మథుర జ్ఞాపకాలుగానే నిలిచిపోతాయి.
-
- కానీ దైనందిన జీవితంలో ఆయన పెద్ద మనసు, ప్రోత్సాహమందించే స్నేహ హస్తం ఇవన్నీ కూడా పరిశ్రమలో ఉండేవారందరకీ అంతులేని ఆలంబనగా మనోధైర్యాన్ని, మానసిక స్థైర్యాన్నీ అందిస్తాయి. ఉదాహరణకి, ఏజెంట్ చిత్రం ఓ పక్కన విడుదలకు సిద్ధమవుతోంది. మరో వైపున భోళాశంకర్ సినిమా షూటింగ్ జరుగుతోంది. రెండిటికీ నిర్మాత అనిల్ సుంకర్ అన్న విషయం అందరికీ తెలిసిందే.
-
- కొంత ఉక్కిరిబిక్కిరలో విడుదలవైపు పరుగులు తీస్తున్న ఏజెంట్ చిత్రాన్ని అన్ని హంగులు పూర్తి చేసి పంపించే ఒత్తిడిలో అనిల్ సుంకర పని చేయాల్సి వస్తోందని అందరూ ఒకటే ఏకరువు పెడుతూనే ఉన్నారు. మరో వైపు....సాక్షాత్తూ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్ చిత్రం షూటింగ్ కార్యక్రమాల నిర్వహణ. రెండింటికీ రెండూ నిర్మాతగా అనిల్ సుంకరకి ప్రధానమైనవే. ముఖ్యమైనవే. దేనినీ పక్కన పెట్టగలిగేవి కావు. ఈ తరుణంలో అనిల్ సుంకర్ భోళాశంకర్ షూటింగ్ కార్యక్రమాల స్పాట్‌కి వెళ్ళి, మెగాస్టార్‌ని పలుకరించి, అక్కడ కూడా ఉండాలని అనిల్ సుంకర ప్రయత్నించారు.
-
- మెగాస్టార్‌కి తెలియని సంగతేమీ కాదు. అయన దృష్టి 360 డిగ్రీలలో సినిమా పరిశ్రమ మొత్తాన్ని వీక్షిస్తూనే ఉంటుంది. అన్ని విషయాలు ఆయన గ్రహణకు చేరుతూనే ఉంటాయి. తన నిర్మాత పరిస్థితి అంతా ఆయనకు అవగతమే. అదే సమయంలో ఆయన కనిపించగానే మెగాస్టార్ కుశలప్రశ్నలు వేసి, అనిల్లోని ఒత్తిడిని గమనించారు. ఎలా జరుగుతోంది, ఏం జరుగుతోంది అనే వివరాలను క్లుప్తంగా
-
- తెలుసుకుని ఏజెంట్ సినిమా విడుదల వ్యవహారాలను సమీక్షించుకోమని, ఆ కార్యక్రమం మీద దృష్టి పెట్టమని ఆత్మీయంగా అనిల్‌ని ముందుకు నడిపించారు. తాను ఉన్నాను చూసుకోవడానికి అనే మాటను చెప్పి మరీ అనిల్ సుంకరని ఆదరణగా పంపించారు. నిర్మాతల సాథకబాధకాలు తెలుసుకుని, అందుకు అనుగుణంగా వ్యవహరించే మెగాస్టార్ తత్వమే ఆయన్ని సాధించిన విజయాలతో పాటుగా అందరికీ ఆత్మీయుడిగా తీర్చిదిద్దాయి. ఈ విషయాన్ని పాత్రికేయ సమావేశంలో అనిల్ సుంకర్ తానే స్వయంగా చెప్పడమే ఇందులో హైలైట్. written by నాగేంద్ర

Ehatv
Next Story