ఆదిపురుష్(Adipurush) కు చిన్నజీయర్(Chinna Jeeyar) ఆశీస్సులు, ప్రీరిలీజ్ కు గెస్ట్ గా త్రిదండి స్వామి.. ప్రస్తతం దేశవ్యాప్తంగా అటేక్షన్ క్రియేట్ చేసిన సినిమా ప్రభాస్ ఆదిపురుష్. ఈ ఏడాది రిలీజ్ కాబోతున్న భారీ బడ్జెట్ సినిమా ఇదే కావడం విషేషం, ఈమూవీ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు.. పాన్ ఇండియా ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈక్రమంలోనే ఈసినిమాను ఈనెల 16న రిలీజ్ చేయడానిక అన్ని సన్నాహాలు చేసుకున్నారు మేకర్స్.

ఆదిపురుష్(Adipurush) కు చిన్నజీయర్(Chinna Jeeyar) ఆశీస్సులు, ప్రీరిలీజ్ కు గెస్ట్ గా త్రిదండి స్వామి..

ప్రస్తతం దేశవ్యాప్తంగా అటేక్షన్ క్రియేట్ చేసిన సినిమా ప్రభాస్ ఆదిపురుష్. ఈ ఏడాది రిలీజ్ కాబోతున్న భారీ బడ్జెట్ సినిమా ఇదే కావడం విషేషం, ఈమూవీ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు.. పాన్ ఇండియా ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈక్రమంలోనే ఈసినిమాను ఈనెల 16న రిలీజ్ చేయడానిక అన్ని సన్నాహాలు చేసుకున్నారు మేకర్స్. ఇక మూవీ రిలీజ్ కు ఎంతో టైమ్ లేకపోవడంతో ప్రమోషన్స్ జోరు పెంచారు టీమ్.

ప్రమోషన్స్ లో భాగంగా.. ప్రీరిలీజ్ ఈవెంట్ ను రేపు గనంగా జరిగించడానికి రెడీ అయ్యారు టీమ్. దీని కోసం భారీగా ఖర్చుక కూడా పెట్టబోతున్నారు. ఇక మరికొన్ని గంటల్లో జరగబోయే ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం సినీ లవర్స్ అంతా అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇప్పటకే ఈ వేడుకకు సంబంధించిన పనులు పూర్తపోయాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభాస్ అభిమానులతో పాటు దేశ వ్యాప్తంగా ప్రభాస్ ప్యాన్స్.. వారి సంఘాలకు పాస్ లు కూడా అందిపోయాయి. శ్రీ వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుపతిలో అంగరంగ వైభవంగా ఈ వేడుక జరుగునుంది.

ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కే దాదాపు రెండు కోట్ల ఖర్చుపెట్టబోతున్నట్టు సమాచారం. జిలుగు వెలుగుల బాణసంచాల కోసమే యాభై లక్షలు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. జై శ్రీరామ్ అంటూ శబ్దం వచ్చేలా బాణాసంచాలను రెడీ చేస్తున్నారట. ఇక మరో పక్క ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ఎవరు గెస్ట్ గా వస్తారా అని ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది.కాగా తాజాగా చిత్రబృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చే గెస్ట్ పేరును ప్రకటించింది. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిన జియర్ స్వామి గెస్ట్ గా రానున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
ఇక ఇలా చిన్న జీయర్ స్వామి సినిమాకు సంబంధించిన వేడుకకు రావడం ఇదే తొలిసారి. ఇక ఈ ఈవెంట్ లో అజయ్-అతుల్ జై శ్రీరామ్ పాటకు లైవ్ పార్ఫార్మె్న్స్ ఇవ్వబోతున్నారు. అంతేకాకుండా దాదాపు రెండోందల సింగర్స్, రెండొందల డ్యాన్సర్లు ముంబై నుంచి ఈ వేడుకకు వస్తున్నారట. పది రోజుల్లో విడుదల కాబోతున్న ఆదిపురుష్ సినిమాపై ప్రేక్షకుల్లో ఎక్కడలేని అంచనాలు నెలకొన్నాయి. ఈ ఈవెంట్ కోసం మ్యూజిక్ డైరెక్టర్ అతుల్.. ముంబయ్ నుంచి తిరుపతికి బైక్ పై యాత్రగా వస్తున్నాడు.

ప్రభాస్ రాముడిగా.. కృతి సనన్ సీతగా నటించిన ఈసినిమాలో రావణాసురిడిగా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ నటించారు. మొదటి నుంచి నెగెటీవ్ టాక్ తెచ్చుకున్న ఈసినిమా ట్రైలర్ తో ఈ టాక్ నుంచి బయట పడింది. సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఆరడుగుల అందగాడు ప్రభాస్ రాముడిగా అదరగొడతాడన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. మరి ఈ మూవీ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. రామాయణం ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఓంరౌత్ దర్శకత్వం వహించాడు.

Updated On 5 Jun 2023 2:39 AM GMT
Ehatv

Ehatv

Next Story