తమిళ సినీ గేయ రచయిత వైరముత్తును(Vairamuthu) ప్రముఖ గాయని చిన్మయి(chinmai) వెంటాడుతూనే ఉంది. వైరముత్తను ఉద్దేశిస్తూ ట్విట్టర్‌లో మరోసారి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గతంలో వైరముత్తు చాలా మంది మహిళలను వేధించారని, ఆయనపై తగు చర్యలు తీసుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను(stalin) కోరారు.
తమిళ సినీ గేయ రచయిత వైరముత్తును(Vairamuthu) ప్రముఖ గాయని చిన్మయి(chinmai) వెంటాడుతూనే ఉంది. వైరముత్తను ఉద్దేశిస్తూ ట్విట్టర్‌లో మరోసారి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గతంలో వైరముత్తు చాలా మంది మహిళలను వేధించారని, ఆయనపై తగు చర్యలు తీసుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను(stalin) కోరారు. ఈ విషయంపై ఆమె చేస్తున్న వరుస ట్వీట్లు సంచలనం రేపుతున్నాయి.ఢిల్లీలో నిరసన తెలుపుతున్న అగ్రశ్రేణి రెజ్లర్లకు(Wrestlers) స్టాలిన్ మద్దతు ఇవ్వడాన్ని ఉద్దేశిస్తూ చిన్మయి పలు కామెంట్లు చేశారు.
'రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(WFI) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు(Brij Bhushan Sharan Singh) అయినా, వైరముత్తుకు అయినా రూల్స్ ఒకే విధంగా ఉండాలి. ఒకరికి ఒక రకంగా, మరొకరికి మరో రకంగా ఉండకూడదు. బ్రిజ్ భూషణ్ తమను లైంగికంగా వేధించాడంటూ మన దేశం గర్వించే ఛాంపియన్స్‌తో పాటు ఓ మైనర్ కూడా ఆరోపించారు. మీ పార్టీతో సత్సంబంధాలు కలిగిన వైరముత్తు వేధించాడంటూ గతంలో నాతో పాటు 17 మంది మహిళలు బహిరంగంగా వెల్లడించాం. దాంతో ఆ వ్యక్తి మా కెరీర్‌ను నాశనం చేశాడు.
మాకున్న కళలతో పోలిస్తే అతడి టాలెంట్ ఏమీ గొప్పది కాదు. దయచేసి వైరముత్తులాంటి వ్యక్తులపై తగిన చర్యలు తీసుకోండి. దాంతో తమిళనాడులోని పని ప్రదేశాలు సురక్షితంగా ఉంటాయి. సొంత ఇండస్ట్రీ నుంచే బహిష్కరణకు(Ban) గురైన ఒక మహిళగా నేను ఈ రోజు మాట్లాడుతున్నా. ఎందుకంటే వైరముత్తుకు ఉన్న రాజకీయ సంబంధాలను దృష్టిలో పెట్టుకుని ఆయనకు వ్యతిరేకంగా నాకు సపోర్ట్ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు' అని చిన్మయి ట్వీట్ చేశారు.
తమను మానసికంగా, లైంగికంగా వేధించిన రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలంటూ ఏప్రిల్ 23 నుంచి అగ్రశ్రేణి రెజ్లర్లు ఆందోళన చేస్తున్నారు.
మొన్నటి వరకు జంతర్‌మంతర్(Jantar Mantar) దగ్గర నిరసనలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తమ గోడును పట్టించుకోకపోవడంతో పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవం దగ్గర ఆందోళన చేపట్టాలని వారు నిర్ణయించారు. దీంతో రెజ్లర్లకు పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు వారి పట్ల దుర్మార్గంగా వ్యవహరించారు. తిట్టారు. కొట్టారు. బలవంతంగా ఈడ్చుకెళ్లారు. ఈ సంఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ స్పందించారు. రెజ్లర్లకు మద్దతు ప్రకటించిన ఆయన పోలీసుల తీరును తప్పుబట్టారు.
ఈ నేపథ్యంలో చిన్మయి గేయ రచయిత వైరముత్తు మంచివాడు కాదని, అతడిపై చర్యలు తీసుకోవాలని సీఎంకు ట్వీట్టర్ వేదికగా రిక్వెస్ట్ చేశారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని, రెజ్లర్ల ఆవేదన అర్థం చేసుకున్నట్టుగానే తమ ఆవేదన కూడా అర్థం చేసుకుని వైరముత్తును శిక్షించాలని కోరారు. తమిళ సినీ పరిశ్రమకు చెందిన చిన్మయి మీటూ ఉద్యమంలో వైరముత్తుకి వ్యతిరేకంగా పలు ఆరోపణలు చేశారు. ఆయన తనను వేధించాడని తెలిపారు. చిన్మయితో పాటు పలువురు గాయనీమణులు కూడా అతడిపై ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో తమిళనాడు సినీ పరిశ్రమ చిన్మయిని బ్యాన్ చేసింది.