అగ్ర హీరోయిన్‌ సమంత(Samantha), గాయని చిన్మయి(Chinmayi) చాలా క్లోజ్‌ ఫ్రెండ్స్‌.. ఇద్దరి ఇష్టాయిష్టాలు ఒక్కటే. తన స్నేహితులురాలు సమంతను ఉద్దేశిస్తూ చిన్మయి ఓ ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌ పెట్టారు. సమంతను బాగా మెచ్చుకున్నారు. సమంత ఒక స్ఫూర్తి అంటూ కితాబిచ్చారు చిన్మయి. జీవితం, సినిమా కెరీర్‌కు సంబంధించి చాలా విషయాలలో సమంతను ఒక ప్రేరణగా తీసుకోవాలని చిన్మయి చెప్పారు. సోషల్‌ మీడియా(Social media) వేదికగా నిందలు వేసేవారిని ఉద్దేశిస్తూ చిన్మయి కర్మ సిద్ధాంతం గురించి మట్లాడారు. అందరి దృష్టిని ఆకర్షించి డబ్బులు సంపాదించుకోవడం కోసం అసభ్యకరంగా, అభ్యంతరకరంగా మాట్లాడితే ఏదో ఒక రోజు ఇబ్బంది ఎదుర్కొక తప్పదని తెలిపారు. ‘‘ఎన్ని నిందలు ఎదురైనా హుందాగా ముందుకు ఎలా సాగాలో నేర్చుకోవాలంటే సమంతను స్ఫూర్తిగా తీసుకోండి.

తన అనారోగ్యం కారణంగా ఓ ప్రాజెక్ట్‌ ఆలస్యమైంది. ఆ ప్రాజెక్ట్‌ కోసం తన పారితోషికాన్ని తగ్గించుకుంది. వచ్చే డబ్బును వద్దనే వారు ఈ కాలంలో ఎంతమంది ఉంటారో నాకు తెలియదు. సోషల్‌మీడియాలో విపరీతమైన నెగెటివిటీ వచ్చినప్పుడు.. తాను మయోసైటిస్‌తో ఇబ్బందిపడుతున్నట్లు చెప్పి.. ఆ సమస్యపై అందరికీ అవగాహన కల్పించడానికి తను ఎంతో కష్టపడుతోంది. సమంత కెరీర్‌ అయిపోయిందని పలువురు కామెంట్‌ చేస్తున్న సమయంలో బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌కు వెళ్లి తన సత్తా చాటుతోంది.

ఎవరు ఎన్ని రకాలుగా దూషించినా, అసభ్యకరంగా మాట్లాడినా వాటిని పట్టించుకోకుండా జీవితంలో ముందుకు సాగుతోంది. ట్విటర్‌లో ఎంగేజ్‌మెంట్స్‌, మానిటైజేషన్‌ అనే గోలతో కొంతమంది ఇటీవల నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారు. కర్మ సిద్ధాంతం అనేది ఎంతో ఆసక్తి కలిగిన అంశం. ఒకరి గురించి అదే పనిగా అబద్ధాలు చెబుతూ దూషిస్తూ ఉంటే ఆ పాపం మొత్తం పేరుకుని ఏదో ఒకరోజు మనకే ఎదురుతిరుగుతుంది. డబ్బులు సంపాదించినా, ఆస్తులు ఉన్నా ఏం లాభం లేదు. తరతరాలకు ఆ కర్మ ఫలం వర్తిస్తుంది. అది ఒక్కసారి మొదలైతే ఎంటర్‌టైన్‌మెంట్‌ మామూలుగా ఉండదు.’’ అని చిన్మయి పేర్కొన్నారు.

Updated On 4 Sep 2023 4:29 AM GMT
Ehatv

Ehatv

Next Story