తిరుమలలో శ్రీవారి దర్శనం తర్వాత ఆలయంలో హీరోయిన్ కృతిసనన్ (Kriti Sanon)ని ఆదిపురుష్ సినిమా డైరెక్టర్ ఓం రౌత్ (Om Raut) ముద్దు పెట్టుకోవడం పెద్ద దుమారంగా మారింది. ఈ ఇష్యూపై తిరుమల భక్తులు, RSS కార్యకర్తలు, హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. అయితే ఈ వివాదంపై చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సీఎస్ రంగరాజన్ (CS Rangarajan) రియాక్ట్ అయ్యారు.
తిరుమలలో శ్రీవారి దర్శనం తర్వాత ఆలయంలో హీరోయిన్ కృతిసనన్ (Kriti Sanon)ని ఆదిపురుష్ సినిమా డైరెక్టర్ ఓం రౌత్ (Om Raut) ముద్దు పెట్టుకోవడం పెద్ద దుమారంగా మారింది. ఈ ఇష్యూపై తిరుమల భక్తులు, RSS కార్యకర్తలు, హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. అయితే ఈ వివాదంపై చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సీఎస్ రంగరాజన్ (CS Rangarajan) రియాక్ట్ అయ్యారు. ఇక అసలు కథ ఏంటంటే మొన్న తిరుపతిలో ఆదిపురుష్ (Adipurush) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఆ నెక్ట్స్ డే చిత్ర బృందం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. శేష వస్త్రాలతో బయటకు వచ్చి వీరు.. సీత క్యారెక్టర్ చేసిన కృతిసనన్ కారులో వెళ్లేందుకు సిద్దమైన టైమ్‌లో.. డైరెక్టర్ ఆమె దగ్గరికి వచ్చి.. టాటా చెప్పి.. ఆ వెంటనే హగ్ (Hug) చేసుకుని చెంపపై కిస్ (Kiss) చేశాడు. ఓ ఫ్లయింగ్ కిస్ కూడా ఇచ్చాడు మన ఓం రౌత్. పబ్లిక్‌లో జరిగిన ఆ వీడియో వైరల్ అవడంతో అది కాస్త వివాదానికి దారి తీసింది.
ఈ తంతుపై చిలుకూరు బాలాజీ అర్చకులు రంగరాజన్(Ranga rajan) సీరియస్ అయ్యారు. తిరుమల కొండపై ఇలాంటి పనులు చేయకూడదని.. అది కరెక్ట్ కాదని అన్నారు. పవిత్రమైన కొండపై నియమాలు పాటించాలని.. ఎప్పుడూ భక్తి ఆలోచనా నియమాలు ఉండాలని అర్చకులు అన్నారు. కొండకు దంపతులు వచ్చినా.. జాగ్రత్తగా ఉంటారని.. కలియుగ వైకుంఠంగా పేరొందిన ఈ ప్రాంతంలో పబ్లిక్‌లో కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం మంచిది కాదని తెలిపారు. ఒకప్పుడు ఎన్టీఆర్(NTR), అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao) లాంటి మహానుభావులు రాముడి పాత్రలు చేసినప్పుడు ఆడియన్స్ వాళ్లను దైవ సమానంగా చూశారు. వాళ్లు అప్పట్లో అంతే భక్తిశ్రద్దలతో ఉండేవాళ్లన్నారు. ఎంతో పవిత్రమైన తిరుమలలో ఇలాంటి పాడు పనులు ఏంటని ఆదిపురుష్ సినిమా డైరెక్టర్ ఓం రౌత్‌పై రంగరాజన్ నిప్పులు చెరిగారు. అలాంటి పనులు చేయడం ఆ సీతారాములను అవమానించడమే అని ఆయన అన్నారు. ఇన్ని వివాదాలనడుమ ఈ నెల 16న ప్యాన్ ఇండియా రేంజ్లో ఆదిపురుష్ చిత్రం విడుదల కానుంది. మరి ఈ సినిమా ఎలాంటి ఆదరణ పొందుతుందో చూడాలి మరి.