ఐపీఎల్ ప్లేఆఫ్ మ్యాచ్‌లు మంగళవారం (మే 23) ప్రారంభమయ్యాయి. క్వాలిఫయర్-1లో గుజరాత్ టైటాన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.

ఐపీఎల్(IPL2023) ప్లేఆఫ్ మ్యాచ్‌(Playoffs)లు మంగళవారం (మే 23) ప్రారంభమయ్యాయి. క్వాలిఫయర్-1లో గుజరాత్ టైటాన్స్‌(Gujarat Titans)పై చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. చెన్నై(Chennai)లోని ఎంఏ చిదంబరం స్టేడియం(MA Chidambaram Stadium)లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya) టాస్ గెలిచి ముందుగా బౌలింగ్(Bowling) ఎంచుకున్నాడు. చెన్నై 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. చేధ‌న‌కు దిగిన‌ గుజరాత్(Gujarat) జట్టు 20 ఓవర్లలో 157 పరుగులకే కుప్పకూలింది.

చెన్నై సూపర్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి ఐపీఎల్‌లో 10వ సారి ఫైనల్‌(Final)కు చేరుకుంది. నాలుగుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై జట్టు అద్భుతంగా పునరాగమనం చేసింది. గత సీజన్‌లో ప్లేఆఫ్‌కు కూడా చేరుకోలేకపోయింది. ధోనీ(MS Dhoni) కెప్టెన్సీలోని చెన్నై జట్టు ఐదోసారి ఛాంపియన్‌గా అవతరించేందుకు స‌న్న‌ద్ధ‌మైంది. మే 28న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం(Narendra Modi Stadium)లో జ‌రుగ‌నున్న ఫైన‌ల్ మ్యాచ్ ఆడ‌నుంది.

మరోవైపు ఈ ఓటమి తర్వాత గుజరాత్ ఫైనల్స్‌కు చేరేందుకు రెండో అవకాశం ఉంటుంది. దీంతో మే 26న అహ్మదాబాద్‌లో జరిగే క్వాలిఫయర్-2లో ఆడనుంది. అక్కడ గుజ‌రాత్ జ‌ట్టు.. ముంబై ఇండియన్స్ లేదా లక్నో సూపర్ జెయింట్ జ‌ట్ల‌తో పోటీపడనుంది. బుధవారం (మే 24) ముంబై, లక్నో మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు క్వాలిఫయర్-2కి వెళ్తుంది.

చెన్నై నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బ‌రిలో దిగిన‌ గుజరాత్ జట్టులో అత్యధికంగా శుభ్‌మన్ గిల్(Shubhman Gill) 38 బంతుల్లో 42 పరుగులు చేశాడు. చివరి ఓవర్లో రషీద్ ఖాన్(Rashid Khan) వేగంగా పరుగులు చేసినా జట్టును గెలిపించలేకపోయాడు. రషీద్ 16 బంతుల్లో 30 పరుగులు, దసున్ షనక 17, విజయ్ శంకర్ 14, వృద్ధిమాన్ సాహా 12 పరుగులు చేశారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఎనిమిది, మహ్మద్ షమీ ఐదు, డేవిడ్ మిల్లర్ నాలుగు, రాహుల్ తెవాటియా మూడు పరుగులు చేసి ఔట్ అయ్యారు. నూర్ అహ్మద్ ఏడు నాటౌట్‌గా నిలిచాడు. చెన్నై తరఫున దీపక్ చాహర్(Deepak Chahar), మహిష్ తీక్షణ, రవీంద్ర జడేజా(Ravindra Jadeja), మతిషా పతిరనా తలో రెండు వికెట్లు తీశారు. తుషార్ దేశ్‌పాండే ఒక వికెట్‌ సాధించాడు. చెన్నై బ్యాట్స్‌మెన్ల‌లో రుతురాజ్‌(60), కాన్వే(40), జ‌డేజా(22) ప‌రుగులు చేశారు. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో ష‌మీ, మోహిత్ శ‌ర్మ(mohit Sharma) త‌లా రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు.

Updated On 23 May 2023 9:05 PM GMT
Yagnik

Yagnik

Next Story