ఇరవై ఏడేళ్ల కిందట వచ్చిన భారతీయుడు(Indian) సినిమా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. కమలహాసన్ హీరోగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డులను సృష్టించింది. అప్పట్లోనే ఈ సినిమా 50 కోట్ల రూపాయల గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. నిర్మాతలపై కాసుల వర్షాన్ని కురిపించింది. ఓ స్వాతంత్ర్య సమరయోధుడు అవినీతిని(Corruption) రూపు మాపడానికి ఎలాంటి ప్రయత్నం చేశాడన్న ఇతివృత్తంతో ఈ సినిమాను రూపొందించారు. శంకర్(Shankar) దర్శకత్వం, కమల్(Kamal Hassan) నటన సంచలనం సృష్టించింది.
ఇరవై ఏడేళ్ల కిందట వచ్చిన భారతీయుడు(Indian) సినిమా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. కమలహాసన్ హీరోగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డులను సృష్టించింది. అప్పట్లోనే ఈ సినిమా 50 కోట్ల రూపాయల గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. నిర్మాతలపై కాసుల వర్షాన్ని కురిపించింది. ఓ స్వాతంత్ర్య సమరయోధుడు అవినీతిని(Corruption) రూపు మాపడానికి ఎలాంటి ప్రయత్నం చేశాడన్న ఇతివృత్తంతో ఈ సినిమాను రూపొందించారు. శంకర్(Shankar) దర్శకత్వం, కమల్(Kamal Hassan) నటన సంచలనం సృష్టించింది. ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు. అదేమిటో కానీ సినిమా మొదలు పెట్టినప్పట్నుంచి అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయి. లాస్టియర్ సెప్టెంబర్‌లో ఈ సినిమా షూటింగ్ మళ్లీ ప్రారంభమయ్యింది. అప్పటి నుంచి బ్రేక్ లేకంఉడా షూటింగ్ జరుగుతోంది.
సినిమా ఆల్‌మోస్టాల్ చివరి దశకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో(Chennai Airport) జరుగుతోంది. విమానాశ్రయంలో ఓ భారీ సీన్‌ను చిత్రీకరిస్తున్న సమయంలో ఎయిర్‌పోర్ట్ నిర్వాహకులు షూటింగ్‌ను మధ్యలోనే ఆపేశారు. ఎయిర్‌పోర్ట్ పరిసర ప్రాంతాలు, డిపార్చర్ ఏరియాలో మాత్రం షూటింగ్ చేసుకోవడానికి పర్మిషన్ ఉంది. కానీ లావటరీ ఏరియాలో షూటింగ్‌కు పర్మిషన్ లేదు. అయినా అక్కడ షూటింగ్ చేస్తుండటంతో ఎయిర్‌పోర్ట్ నిర్వాహకులు అడ్డుకున్నారు. డిపార్చర్ ఏరియాలో పర్మిషన్ కోసం చిత్రబృందం ఏకంగా కోటీ ఇరవైనాలుగు లక్షల రూపాయలు చెల్లించింది. లైకా సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సిద్ధార్థ్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.