టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ హీరో రామ్‌(Ram Pothineni).. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్(Puri Jagannath) కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా డబుల్ ఇస్మార్ట్‌ డాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్ పట్టుదలతో.. హిట్టు కోట్టాలని పక్కా ప్లానింగ్ తో సినిమా మొదలు పెట్టాడు. లైగర్(Liger) ఫెయిల్యూర్ నుంచి బయట పడటానికి మళ్ళీ రామ్ తోనే సినిమా చేస్తున్నాడు పూరీ. రీసెంట్ గా ఈమూవీ షూటింగ్ గ్రాండ్‌గా షురూ అయింది. ఇప్పటికే హై ఆక్టేన్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి పరుగులు పెడుతోంది.

మళ్లీ పూరీ టైమ్ స్టార్ట్ అయ్యింది. ఇస్మార్ట్ టీమ్ కలిసి డబుల్ ఇస్మార్ట్ కు రెడీ అవుతున్నారు. అందులో భాగంగా వర్క్ స్పీడ్ గా నడుస్తుంది. ఈ క్రమంలోనే సెల్ఫీ పిక్స్ తో ఆకట్టుకుంటున్నారు టీమ్.

టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ హీరో రామ్‌(Ram Pothineni).. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్(Puri Jagannath) కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా డబుల్ ఇస్మార్ట్‌ డాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్ పట్టుదలతో.. హిట్టు కోట్టాలని పక్కా ప్లానింగ్ తో సినిమా మొదలు పెట్టాడు. లైగర్(Liger) ఫెయిల్యూర్ నుంచి బయట పడటానికి మళ్ళీ రామ్ తోనే సినిమా చేస్తున్నాడు పూరీ. రీసెంట్ గా ఈమూవీ షూటింగ్ గ్రాండ్‌గా షురూ అయింది. ఇప్పటికే హై ఆక్టేన్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి పరుగులు పెడుతోంది.

అయితే ఈ మూవీ షూటింగ్ అప్ డేట్ ను తెలియజేస్తూ.. రామ్‌పై ఉస్తాద్‌ స్టైల్‌లో వ్యాన్‌లో వచ్చే సీన్‌ స్టిల్ షేర్ చేయగా అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. నెట్టింట హల్‌ చల్‌ చేస్తోంది. ఇక తాజాగా ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. ఈ విషయాన్ని ఈసినిమా నిర్మాత ఛార్మీ(Charmi) స్వయంగా వెల్లడిచారు. రామ్‌తో దిగిన సెల్ఫీని షేర్‌ చేసుకుంటూ.. మొదటి యాక్షన్‌ ప్యాక్‌డ్‌ షెడ్యూల్‌ పూర్తయింది. ఇప్పుడిక మరో క్రేజీ షూట్ కోసం ఇండియా దాటే సమయం వచ్చేసింది.. అంటూ ట్వీట్ చేసింది ఛార్మీ కౌర్.

ప్రస్తుతం స్టిల్‌ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో 2024 మార్చి 8న విడుదల చేస్తున్నట్టు పూరీ కనెక్ట్స్ బ్యానర్‌ మరోసారి తెలియజేసింది.ఇస్మార్ట్‌ ఈజ్ బ్యాక్‌.. ఈ సారి డబుల్ ఇంపాక్ట్‌.. అని ట్వీట్ చేసి సినిమాపై అంచనాలు అమాంతం పెంచేశారు. ఇప్పటికే శక్తిమంతమైన త్రిశూలం.. బ్యాక్ డ్రాప్‌లో మంటలు కనిపిస్తున్న లుక్ నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.

Updated On 1 Aug 2023 12:38 AM GMT
Ehatv

Ehatv

Next Story